ఫార్మాట్‌తో సంబంధం లేకుండా ఆది నుంచి బౌలర్లపై విరుచుకుపడటం ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్టైల్. కానీ గత కొన్ని రోజులుగా వార్నర్‌లో దూకుడు తగ్గింది. టీ20ల్లో టెస్టు తరహా ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. బిగ్ బాష్ లీగ్‌తో పాటు ఇంటర్నేషనల్ లీగ్ టీ20లోనూ అదే ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. తాజాగా తన స్లో ఇన్నింగ్స్‌తో దుబాయ్ క్యాపిటల్స్ ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. ఈ సీజన్‌లో దుబాయ్ జట్టుకు వార్నర్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
షార్జా వారియర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ అయిదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దుబాయ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 170 పరుగులు చేసింది. సామ్ బిల్లింగ్స్ (52; 31 బంతుల్లో), సికిందర్ రజా (48; 23 బంతుల్లో) సత్తాచాటారు. అయితే ఓపెనర్‌గా వచ్చిన వార్నర్ 27 బంతుల్లో 20 పరుగులే చేశాడు. 74 స్ట్రైక్‌రేటుతోనే పరుగులు రాబట్టాడు. కేవలం రెండు బౌండరీలు మాత్రమే బాదాడు.

అనంతరం షార్జా వారియర్స్ అయిదు వికెట్లు కోల్పోయి 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (93; 51 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హమీద్ (24*; 20 బంతుల్లో), డానియల్ సామ్స్ (16; 8 బంతుల్లో) ఫర్వాలేదనిపించారు. అయితే టార్గెట్‌ను షార్జా అంత ఈజీగా ఛేజింగ్ చేయలేదు. 44 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కానీ తర్వాత పుంజుకుని విజయతీరాలకు చేర్చింది.
వార్నర్ ఇన్నింగ్స్ మ్యాచ్ ఫలితంలో కీలకంగా మారింది. వార్నర్ దూకుడుగా ఆడి ఉంటే దుబాయ్ క్యాపిటల్స్ మరో 15 నుంచి 20 పరుగులు అదనంగా చేసి ఉండేది. కాగా, వార్నర్ ముంబయి ఎమిరేట్స్ మ్యాచ్‌లోనూ ఏడు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగే చేశాడు. అయితే ప్రత్యర్థి బౌలర్లు తనకు తెలివిగా బౌలింగ్ చేస్తున్నారని, పేస్‌లో మార్పులు చేస్తూ ఇబ్బంది పెట్టారని షార్జా మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ తన ప్రదర్శన గురించి చెప్పాడు.