Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

డుప్లెసిస్ విధ్వంసం.. సెమీస్‌లో సూపర్ కింగ్స్ (Video)

సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) ఎలిమినేటర్ మ్యాచ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో పార్ల్ రాయల్స్‌పై నెగ్గి క్వాలిఫయిర్-2 (సెమీఫైనల్)కు అర్హత సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన జోబర్గ్ మ్యాచ్‌ను వన్‌సైడ్‌గా మార్చింది. గురువారం జరగనున్న సెమీస్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జోబర్గ్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో శనివారం జరిగే ఫైనల్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ పోటీపడుతుంది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన పార్ల్ రాయల్స్ 18.5 ఓవర్లలోనే 138 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్ర బౌలర్ సామ్ కుక్ (4/24) ధాటికి రాయల్స్ బ్యాటర్లు వణికిపోయారు. మూడో ఓవర్‌లో బట్లర్ (10; 8 బంతుల్లో), వాన్ బ్యూరెన్ (0)ను సామ్ కుక్ మూడు బంతుల వ్యవధిలోనే ఔట్ చేసి రాయల్స్‌ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత బర్గర్ కూడా దాడి చేయడంతో 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

Du Plessis destruction batting helped Joburg Super Kings enters into Qualifier 2

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ మిల్లర్ (47; 40 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. డేన్ విలాస్ (21; 16 బంతుల్లో)తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కానీ సూపర్ కింగ్స్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు పడగొట్టారు. సామ్ కుక్ నాలుగు వికెట్లు, బర్గర్ మూడు, తాహిర్ రెండు వికెట్లు తీశారు.

అనంతరం జోబర్గ్ సూపర్ కింగ్స్ 13.2 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు డుప్లూయ్ (68; 43 బంతుల్లో), ఫాఫ్ డుప్లెసిస్ (55; 34 బంతుల్లో) పది ఓవర్లలోనే శతక భాగస్వామ్మాన్ని నెలకొల్పారు. వీరిద్దరు విధ్వంసం సృష్టిస్తూ పరుగులు సాధించారు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ పవర్‌ప్లేలో 63 పరుగులు తీశారు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీలు అందుకున్నారు. షంసీ బౌలింగ్‌లో డుప్లూయ్ స్టంపౌట్ అయినా సూపర్ కింగ్స్ ఛేజింగ్ సజావుగానే సాగింది.డుప్లెసిస్ ఆఖరి వరకు క్రీజులో నిలిచి జట్టును గెలిపించాడు. సామ్ ‌కుక్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.

Story first published: Thursday, February 8, 2024, 9:25 [IST]
Other articles published on Feb 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+