హైదరాబాద్: ఆస్ట్రేలియా మీడియా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. బెంగుళూరు టెస్టులో ఆసీస్ కెప్టెన్ రివ్యూ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగలు చేసినట్లు ఆధారాలున్నాయని ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ క్రీడాస్ఫూర్తికి భంగం కలగకూడదనే ఉద్దేశంతో ఆ ఫిర్యాదుని గురువారం అర్ధరాత్రి వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.
రోజు రోజుకు తీవ్రమవుతున్న ఈ డీఆర్ఎస్ గొడవను ఇరు బోర్డులు కలిసి తెరదించాయి. ఇందులో భాగంగా బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా కలిసి గురువారం రాత్రి సంయుక్త ప్రకటన జారీ చేశాయి. 'రాంచీ టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు సమావేశమవుతారు. మిగిలిన సిరీస్‌ను క్రీడాస్ఫూర్తితో ఆడేలా, ఆటగాళ్లుగా తమ దేశాలకు అసలైన రాయబారులుగా వ్యవహరించేలా కోహ్లి, స్మిత్ తమ జట్లను నడిపిస్తారు' అని అందులో పేర్కొంది.