డీఆర్‌ఎస్ 'చీటింగ్': స్మిత్‌ను వెనుకేసుకొచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా, కోచ్
హైదరాబాద్: డీఆర్ఎస్‌ను డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ సిస్టమ్‌గా మార్చిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఐసీసీ రిఫరీ క్రిస్ బ్రాడ్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ ఫిర్యాదు చేసింది. బెంగుళూరు వేదికగా ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ 21వ ఓవర్లో ఉమేశ్ వేసిన మూడో బంతిని ఎదుర్కొన్న స్మిత్ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్లు భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు.
దీంతో వెంటనే అంపైర్ కెప్టెన్ స్మిత్ అవుటైనట్లు ప్రకటించాడు. వెంటనే భారత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగారు. వెంటనే రివ్యూ కోరదామని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న హ్యాండ్స్ కోంబ్‌ను అడిగాడు. దీంతో అతడు డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపుతూ టీమ్ మేట్స్‌ను సలహా కోరమని సూచించాడు. ఇదంతా సమీపంలో ఉన్న కోహ్లీ గమనించి అంపైర్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు.
ఈ సమయంలో అంపైర్ నిగెల్ లాంగ్ కల్పించుకొని అది నిబంధనలకు విరుద్ధమని వారించడంతో మైదానాన్ని వీడి స్మిత్ వెళ్లిపోయాడు. ఇలా క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన స్టీవ్ స్మిత్ తీరుపై అటు భారత మాజీ క్రికెటర్లతో పాటు ఆసీస్ మాజీలు సైతం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది నిబంధనలకు విరుద్ధమని, ఇది మంచిది కాదని ఆసీస్ మాజీ దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ అన్నాడు.

అంత సులువుగా వదలకూడదు
అయితే రెండో టెస్టులో తాను డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి సైగలు చేసిన వివాదంపై స్పందించిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్, తాను అలా చేసి ఉండాల్సింది కాదని, కెప్టెన్ గానే కాకుండా ఆటగాడిగా కూడా అలా వ్యవహరించకూడదని సారీ కూడా చెప్పాడు. అయితే ఈ విషయాన్ని అంత సులువుగా వదలేయకూడదని టీమిండియా భావిస్తోంది.

కోహ్లీ మండిపాటు
రెండో టెస్టు విజయానంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్ల ఆటతీరుపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. డీఆర్ఎస్ పేరుతో మూడు రోజులుగా ఆస్ట్రేలియా జట్టు మోసానికి పాల్పడిందని కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. డీఆర్ఎస్‌ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ సిస్టమ్‌గా మార్చేశారని కోహ్లీ విమర్శించాడు.
స్టీవ్ స్మిత్ లక్ష్మణ రేఖను దాటాడు
టెస్టులో కెప్టెన్ స్టీవ్ స్మిత్ లక్ష్మణ రేఖను దాటాడని, దీనిపై ఐసీసీ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్‌మెంట్ స్మిత్‌పై మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. దీనిపై 48 గంటల్లో ఐసీసీ రిఫరీ క్రిస్ బ్రాడ్ స్పందించనున్నాడు. ఇదిలా ఉంటే డీఆర్ఎస్ వివాదంలో క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్‌కు బాసటగా నిలిచింది.
క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ ఇలా
స్మిత్‌పై టీమిండియా వ్యాఖ్యలు దారుణమని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ అన్నారు. స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా టీమ్ చిత్తశుద్ధిని అనుమానించేలా ఈ ఆరోపణలు ఉన్నాయని అన్నారు. 'స్మిత్ ఓ గొప్ప ఆటగాడు. ఎందరో యువ క్రికెటర్లకు ఆదర్శప్రాయుడు. అతని చర్యల్లో ఎలాంటి దురుద్దేశం ఉంటుందని భావించడం లేదు. ఈ విషయంలో స్మిత్, ఆస్ట్రేలియా టీమ్ వెంట మేమున్నాం' అని సదర్లాండ్ అన్నారు.
స్టీవ్ స్మిత్‌ను వెనకేసుకొచ్చిన కోచ్ డారెన్ లీమన్
ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా జట్టు కోచ్ డారెన్ లీమన్ కూడా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వెనకేసుకొచ్చాడు. రివ్యూ కోరే విషయంలో ఆసీస్ టీమ్ పదేపదే డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తుందన్న కోహ్లీ ఆరోపణలను కోచ్ లీమన్ ఖండించాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పుగా ఆలోచిస్తున్నాడని అన్నాడు. ‘ఈ ఆరోపణలు విని ఎంతో ఆశ్చర్యపోయా. అతడి అభిప్రాయాలు అతడివి.. మావి మాకుంటాయి. కానీ మేం నిజాయతీగానే ఆడాం. ఎలాంటి మోసాలకూ పాల్పడలేద'ని చెప్పాడు..
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications