Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అర్ధరాత్రి ఫిర్యాదు వెనక్కి: బీసీసీఐ, సీఏల మధ్య కుదిరిన 'రాజీ'

హైదరాబాద్: బెంగుళూరు టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ ఘటన అనేక మలుపులు తిరిగి చివరికి 'రాజీ'తో ముగిసింది. రోజు రోజుకు తీవ్రమవుతున్న ఈ గొడవకు తెరదించాలని బీసీసీఐ నిర్ణయించింది. బుధవారం ఎవరిపై చర్యలు లేవంటూ ఐసీసీ చేసిన ప్రకటనపై సంతృప్తి చెందని బీసీసీఐ, గురువారం కెప్టెన్ స్మిత్, హ్యాండ్స్‌కోంబ్‌పై అధికారికంగా ఫిర్యాదు చేసింది.

అయితే తెరవెనుక ఏం జరిగిందో గానీ బీసీసీఐ కొన్ని గంటల్లోనే తన మనసు మార్చుకుంది. గురువారం అర్ధరాత్రి సమయంలో రెండు దేశాల బోర్డులు ఈ వివాదాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాయి. దీంతో బీసీసీఐ, క్రికెట్‌ ఆస్ట్రేలియా కలిసి గురువారం రాత్రి సంయుక్త ప్రకటన జారీ చేశాయి.

రాంచీ టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్ల భేటీ

రాంచీ టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్ల భేటీ

రాంచీ టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు సమావేశమవుతారు. మిగిలిన సిరీస్‌ను క్రీడాస్ఫూర్తితో ఆడేలా, ఆటగాళ్లుగా తమ దేశాలకు అసలైన రాయబారులుగా వ్యవహరించేలా కోహ్లి, స్మిత్‌ తమ జట్లను నడిపిస్తారని అందులో పేర్కొంది. రెండో టెస్టులో స్మిత్‌, హ్యాండ్స్‌కాంబ్‌ ఐసీసీ నియమావళిలో లెవల్‌ 2 నేరానికి పాల్పడ్డారని అందుకు సంబంధించి కీలక పత్రాలు, వీడియో పుటేజీలను ఐసీసీకి మెయిల్ చేసింది.

స్మిత్, హ్యాండ్స్‌కోంబ్‌లపై బీసీసీఐ ఫిర్యాదు

స్మిత్, హ్యాండ్స్‌కోంబ్‌లపై బీసీసీఐ ఫిర్యాదు

‘స్మిత్, హ్యాండ్స్‌కోంబ్‌లపై బీసీసీఐ అధికారికంగా ఫిర్యాదు చేసింది. స్మిత్‌ను పెవిలియన్‌ వైపునుంచి సలహా అడగమంటూ హ్యాండ్స్‌కోంబ్‌ చెప్పడం, అంపైర్‌ నైజేల్‌ లాంగ్‌ జోక్యం చేసుకున్న వీడియోను కూడా మేం జత చేశాం. నిబంధనల ప్రకారం మ్యాచ్‌ ముగిసిన 48 గంటల్లోపే ఈ ఫిర్యాదు దాఖలు చేశాం' అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

సాయంత్రానికి సీన్ రివర్స్

సాయంత్రానికి సీన్ రివర్స్

అయితే సాయంత్రానికి సీన్ మొత్తం రివర్స్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా (సీఏ) సీఈఓ జేమ్స్‌ సదర్లాండ్‌ ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బీసీసీఐ సీఈఓ రాహుల్‌ జోహ్రితో సమావేశమయ్యాడు. దీంతో వీరిద్దరు కలిసి ఏం మాట్లాడారో తెలియదుకానీ సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశం అనంతరం ఐసీసీకి చేసిన ఫిర్యాదుని బీసీసీఐ అర్ధరాత్రి వెనక్కి తీసుకుంది.

ఇరు జట్ల కెప్టెన్లు క్రీడాస్ఫూర్తితో

ఇరు జట్ల కెప్టెన్లు క్రీడాస్ఫూర్తితో

మరోవైపు మార్చి 16 నుంచి రాంచీలో ప్రారంభం కానున్న టెస్టుకు ముందు ఇరు జట్ల కెప్టెన్లు క్రీడాస్ఫూర్తికి కట్టుబడి ఉంటామని హామీ ఇస్తారని సమాచారం. సమావేశం అనంతరం ‘భారత్‌, ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్‌ ప్రేక్షకుల్లో ఉద్వేగాన్ని నింపాలి. మైదానంలో రెండు జట్లు గట్టి ప్రత్యర్థులు. సిరీస్‌ హోరాహోరీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వివాదాన్ని పక్కనబెట్టాలని నిర్ణయించాం' అని జేమ్స్‌ సదర్లాండ్‌ అన్నాడు.

'డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ' వివాదం ముగిసినట్లే

'డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ' వివాదం ముగిసినట్లే

మరోవైపు బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి సైతం ‘ఆస్ట్రేలియాతో పోటీని భారత్‌ ఎప్పుడూ ఆస్వాదిస్తుంది. రెండు జట్లు వివాదాలపై కాకుండా ఆటపై దృష్టి సారించాలని నిర్ణయించాం' అని చెప్పాడు. ఇరు దేశాల బోర్డులు కలగ జేసుకోవడంతో రెండో టెస్టులో విదవాస్పదమైన 'డ్రెస్సింగ్ రూమ్ రివ్యూ' వివాదం ముగిసిపోయినట్లేనని భావిస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+