For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్ట్ కప్‌లో రెండ్రోజుల్లో 2సార్లు వివాదం: పాక్ - భారత్ మ్యాచ్‌లో..

By Srinivas

అడిలైడ్: పాకిస్తాన్ - భారత్ మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఓ కాంట్రోవర్సీ తలెత్తింది. ప్రపంచకప్ ఫిబ్రవరి 14వ తేదీన ప్రారంభమైంది. రెండు రోజుల్లో రెండుసార్లు డీఆర్ఎస్ వివాదం కనిపించింది. శనివారం నాడు ఇంగ్లాండ్ దిగ్గజం జేమ్స్ టేలర్.. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే, అంపైర్ తప్పిదంతో తృటిలో శతకం చేజార్చుకున్నాడు.

41 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. 42 ఓవర్లో టేలర్ వ్యక్తిగత స్కోరు 98 వద్ద ఉన్నప్పుడు హేజిల్ వుడ్ బంతిని ఆడబోగా.. అది ప్యాడ్లకు తగిలింది. అంపైర్ అలీమ్ దార్ ఔటిచ్చాడు. టేలర్ సమీక్ష కోరాడు. నాటౌటని రిప్లేలో తేలింది.

DRS controversy in India-Pakistan World Cup match

ఐతే వివాదాస్పద రీతిలో చివరి బ్యాట్స‌మన్ అండర్సన్‌ను రనౌట్‌గా ప్రకటించడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. హేజిల్ వుడ్ బంతి టేలర్ ప్యాడ్లకు తగిలి పక్కకు వెళ్లినప్పుడే పరుగు కోసం యత్నించిన అండర్సన్ క్రీజులోకి చేరుకనే లోపే మాక్స్‌వెల్ వికెట్ పడగొట్టాడు. టేలర్ నాటౌట్‌గా తేలాక.. దీని పైనే మూడో అంపైర్‌ను సంప్రదించిన ధర్మసేన... ్ండర్సన్ రనౌట్‌గా ప్రకటించాడు. ఇది వివాదాస్పదమైంది.

ఆదివారం నాడు... థర్ట్ అంపైర్ ఇంగ్లాండ్‌కు చెందిన స్టీవా డేవిస్ నిర్ణయంలో కూడా ఇలాగే జరిగింది. 25వ ఓవర్లో ఉమర్ అక్మల్ ఔట్ కోసం భారత్ అప్పీల్ చేసింది. భారత్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్ ధోనీ అవుట్ కోసం అప్పీల్ చేశాడు. అయితే, ఇంగ్లీష్ ఎంపైర్ రిచర్ట్ కెటిల్ బరో నాటౌట్‌గా చెప్పాడు. దీంతో ధోనీ నిర్ణయ సమీక్షను కోరాడు. ధోనీ డీఆర్ఎస్ (నిర్ణయ సమీక్ష) అంత అనుకూలం కాదు. రిప్లేలో అవుటని తేలింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+