Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చర్యలు ఉండవు: స్మిత్ డీఆర్ఎస్ వివాదంపై తేల్చేసిన ఐసీసీ

హైదరాబాద్: ఏ ముహుర్తంలో అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్‌ఎస్)ని తీసుకొచ్చారో ఏమో కానీ మొదటి నుంచి వివాదాస్పదం అవుతూనే ఉంది. తొలినాళ్లలో డీఆర్ఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన బీసీసీఐ ఆ తర్వాత అన్ని జట్లు మొగ్గుచూపడంతో ఇంగ్లాండ్‌తో ముగిసిన సిరిస్‌లో డీఆర్‌ఎస్‌కు అయిష్టంగానే ఆమోదం తెలిపింది.

అయితే ఎప్పుడైతే డీఆర్‌ఎస్‌ అంగీకరించిందో అప్పటి నుంచి భారత జట్టుకు ప్రతికూల ఫలితాలే ఎదురయ్యాయి. ప్రస్తుతం ఆసీస్‌తో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో డీఆర్‌ఎస్ విధానం కొత్త రంగు పులుముకుంది. ఇప్పటివరకు డీఆర్‌ఎస్ నిర్ణయాలకు తలొగ్గి పెవిలియన్‌కు వెళ్లిన బ్యాట్స్‌మెన్ తాజాగా వింత పోకడలతో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు.

స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూ

స్టీవ్ స్మిత్ డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూ

బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అవుట్‌తో తాజా ఉదంతం వెలుగులోకి వచ్చింది. బెంగుళూరు టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ‘డ్రెస్సింగ్‌ రూమ్‌ రివ్యూ' ఘటనను అంత సులభంగా వదలకూడదని భావించిన బీసీసీఐకి నిరాశే ఎదురైంది.

ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ

ఐసీసీకి ఫిర్యాదు చేసిన బీసీసీఐ

స్టీవ్ స్మిత్‌ డీఆర్ఎస్ రివ్యూ రెండో టెస్టు మ్యాచ్‌పై ఎలాంటి ప్రభావం చూపకపోయినా, అతనిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీకి సైతం బీసీసీఐ ఫిర్యాదు చేసింది. అయితే ఐసీసీ మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంది. ఈ వివాదంలో స్మిత్, కోహ్లీపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఐసీసీ బుధవారం ప్రకటన విడుదల చేసింది.

ఎలాంటి చర్యలు ఉండవని తేల్చి చెప్పిన ఐసీసీ

ఎలాంటి చర్యలు ఉండవని తేల్చి చెప్పిన ఐసీసీ

‘బెంగళూరు టెస్టులో జరిగిన ఘటనల విషయంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఏ ఆటగాడిపై కూడా ఆరోపణలు నమోదు చేయడం లేదని ఐసీసీ నిర్ధారిస్తోంది. స్టీవ్‌ స్మిత్, కోహ్లికి సంబంధించి జరిగిన రెండు సంఘటనలు కూడా మ్యాచ్‌లో భాగంగానే ఐసీసీ చూస్తోంది కాబట్టి ఆటగాళ్లపై తదుపరి ఎలాంటి చర్యలు ఉండవు. ఇరు జట్ల ఆటగాళ్ల భావోద్వేగాలు కూడా కీలక పాత్ర పోషించిన అద్భుతమైన టెస్టు మ్యాచ్‌ను మనం చూశాం. రాంచీలో జరిగే మూడో టెస్ట్‌పైనే దృష్టిసారించాలని ఇరు జట్లకూ సూచిస్తున్నాం. టెస్ట్‌ ఆరంభానికి ముందు మ్యాచ్‌ రెఫరీ ఇరు జట్ల కెప్టెన్లనూ పిలిచి వారి బాధ్యతలను గుర్తు చేస్తాడు' అని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డేవ్‌ రిచర్డ్‌సన్‌ చెప్పాడు.

ఐసీసీ నిర్ణయంపై బీసీసీఐ అసంతృప్తి

ఐసీసీ నిర్ణయంపై బీసీసీఐ అసంతృప్తి

అయితే ఈ నిర్ణయంపై టీమిండియా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ఐసీసీ నిర్ణయంపై కూడా అప్పీలుకు వెళ్లనున్నట్టు బీసీసీఐ పేర్కొంది. గురువారం ఈ విషయంపై భారత్‌ అప్పీలు చేయనున్నట్టు తెలుస్తోంది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+