Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20ల మాయలోపడి టెస్టులను విస్మరిస్తున్నారు: గ్రేమ్ స్మిత్

Drop T20Is, market Test cricket smartly: Graeme Smith

హైదరాబాద్: దశాబ్దాల చరిత్ర ఉన్న టెస్టు క్రికెట్ మరుగున పడిపోతుందని... టీ20 మాయాలో పడిపోవద్దని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ సూచించాడు. గంటల వ్యవధిలో ముగిసిపోయే ఆ ఫార్మాట్‌కి వస్తున్న ఆదరణ దృష్ట్యా ఎక్కువ పెట్టుబడుల్ని అక్కడే పెడుతున్నారని.. అందులో కొద్దిభాగమైనా టెస్టుల్లోకి మళ్లిస్తే సుదీర్ఘ ఫార్మాట్‌ని రక్షించుకోవచ్చని ఆయన వివరించారు.

'అంతర్జాతీయ స్థాయిలో టీ20 మ్యాచ్‌లు జరగడకూడదని బలంగా నమ్మే వ్యక్తిని. కావాలనుకుంటే.. రెండేళ్లకి ఒకసారి టీ20 ప్రపంచకప్‌ని నిర్వహించుకోవచ్చు. టెస్టు క్రికెట్‌ మనుగడ గురించి చర్చించాల్సిన సమయం ఇదే. గతంలో కంటే ఇంకా ఎక్కువగా టెస్టు క్రికెట్‌ మార్కెట్‌ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చాలా డబ్బులు టీ20 క్రికెట్‌లోనే పెట్టేస్తున్నారు. ఎందుకంటే టీ20లు అద్భుతమైన ఫార్మాట్. ఐసీసీ ఇప్పటికైనా టెస్టు ఫార్మాట్‌ని రక్షించేందుకు నడుం బిగించాలి. అవసరమైతే టీ20లను తగ్గించి.. టెస్టుల మనగడని కాపాడేందుకు అందరితో చర్చించాలి' అని గ్రేమ్‌స్మిత్ వివరించాడు.

'టీ 20ని రెండేళ్లకోసారి నిర్వహించుకోవచ్చు. కానీ, పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20ని కొనసాగించడం భావ్యం కాదు. ఒక్క దేశీవాలీ టోర్నీలోనే ఇది బాగా సెట్ అవుతుందని ఆయన తెలిపాడు.
దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో కలిస్ తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన గ్రేమ్‌స్మిత్.. కెప్టెన్‌గానూ అత్యుత్తమంగా రాణించాడు.

టీ 20 క్రికెట్‌కు సమానమైన హోదాను టెస్టు క్రికెట్‌కు కల్పించాలని ఆయన అన్నాడు. ఏడాదిలో రెండు దఫాలుగా మొదటి ఆర్నెళ్లు టీ20 మరో ఆర్నెళ్లు టెస్టు క్రికెట్ ఆడినా బాగానే ఉంటుందని పేర్కొన్నాడు. ఇటీవల టెస్టు క్రికెట్‌లో సుస్థిరం కావాలని విరాట్ కోహ్లీ విదేశాలకు వెళ్లి ఆడేందుకు సిద్దపడ్డాడని ఆయన గుర్తు చేసుకున్నాడు. అందరూ కోహ్లీలా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు

Story first published: Thursday, May 31, 2018, 13:55 [IST]
Other articles published on May 31, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+