For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ, స్మిత్‌లకు మధ్య తేడా ఏంటో చెప్పిన వార్నర్‌!!

Drive to succeed different for Virat Kohli and Steve Smith, feels David Warner

సిడ్నీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ తమ జట్లపై చూపించే ప్రభావం ఒకేవిధంగా ఉంటుందని ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు. స్మిత్‌ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తే.. కోహ్లీ ఉద్వేగంతో బ్యాటింగ్‌ చేస్తూ ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయిస్తాడని వార్నర్ చెప్పాడు. కోహ్లీ, స్మిత్‌ ఇద్దరిలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరు? ఈ అంశంపై చాలాకాలంగా చర్చ నడుస్తూనే ఉన్న విషయం తెలిసిందే.

గత జనవరిలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో కోహ్లీ, స్టీవ్ స్మిత్ ఇద్దరిలో మేటి బ్యాట్స్‌మన్ ఎవరన్న చర్చ తెరమీదకు వచ్చింది. అయితే ఈసారి వార్నర్ మాత్రం ఇద్దరి మధ్య ఉన్న తేడాను వివరించాడు. క్రిక్‌బజ్ ఇన్ షోలో హర్షా భోగ్లేతో వార్నర్ మాట్లాడుతూ... 'స్మిత్‌తో పోలిస్తే కోహ్లీ అభిరుచి, పరుగులు చేసే విధానం భిన్నంగా ఉంటుంది. స్మిత్ క్రీజులోకి వెళ్లి బంతిని మిడిల్‌ చేసేందుకు ప్రయత్నిస్తాడు. తనలో తానే ఆస్వాదిస్తుంటాడు. ఔటవ్వాలనుకోడు' అని అన్నాడు.

'విరాట్‌ కోహ్లీ సైతం ఔటవ్వాలనుకోడు. క్రీజులో కుదురుకుంటే అత్యంత వేగంగా పరుగుల వరద పారిస్తానని అతడికి తెలుసు. ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. టీమిండియాలో ఇలాంటి ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు' అని వార్నర్‌ అన్నాడు. 'క్రికెట్‌ పరంగా చెబితే కోహ్లీ, స్మిత్‌ మానసికంగా అత్యంత బలవంతులు. వారిద్దరూ చక్కని ఇన్నింగ్స్‌ ఆడితే.. జట్టులో ప్రేరణ పెరుగుతుంది. వారు జట్టులో స్ఫూర్తి, నిలకడను తీసుకురాగలరు. వారు పరుగులు చేస్తే అందరూ ప్రేరణ చెందుతారు. త్వరగా ఔటైతే కాస్త ఆందోళన పడతారు. పరిస్థితులు కష్టంగా ఉన్నాయని మనం బాధ్యత తీసుకోవాలని భావిస్తారు' అని వార్నర్‌ పేర్కొన్నాడు.

తనకు, కోహ్లీకి సారూప్యతల గురించి డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ... 'విరాట్‌ కోహ్లీ గురించి మాట్లాడలేను. కానీ మేమిద్దరం ఒకటి ఇష్టపడతాం. మధ్యలో బ్యాటింగ్‌కు వెళ్లినప్పుడు అవతలివారి ఆలోచన తప్పని నిరూపించాలనుకుంటాం. పోటీ నెలకొందంటే పరుగులు చేయాలన్న పట్టుదల పెరుగుతుంది. త్వరిత సింగిల్స్‌ తీస్తాం. జట్టును గెలిపించాలనుకుంటాం' అని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, May 7, 2020, 14:20 [IST]
Other articles published on May 7, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+