Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీతో కలిసి ఆడాలన్న కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది

 Dream Come True to Play With Kohli and De Villiers: Washington Sundar

హైదరాబాద్: ఐపీఎల్ 2018 ఆటగాళ్ల వేలంలో ఆర్‌సీబీ ఆదివారం యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ని రూ. 3.2 కోట్లతో కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. గత ఐపీఎల్‌లో రైజింగ్‌ పుణే తరుపున ఆడి మహేంద్రసింగ్‌ ధోని, కెప్టెన్‌ స్టీవ్‌స్మిత్‌లను మెప్పించిన తమిళ యువకెరటం, స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ఈ ఏడు వేలంలో రూ.3.3 కోట్లు పలికాడు. ఈ ధరకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సుందర్‌ను సొంతం చేసుకుంది.

ఈ తరుణంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌తో కలిసి ఆడాలనే తన కల నెరవేరిందని ఈ యంగ్‌ క్రికెటర్‌ ఆనందం వ్యక్తం చేశాడు. 'నన్ను ఆర్‌సీబీ ఎంచుకోవడం ఆనందం కలిగించింది. నేను విరాట్‌ కోహ్లికి, ఏబీ డివిలియర్స్‌కు పెద్ద అభిమానిని. గతేడాది రైజింగ్‌పుణే తరపున ధోనితో కలిసి ఆడటం ఇప్పుడు ఈ లెజెండ్స్‌తో ఆడే అవకాశం రావడం వెలకట్టలేని అనుభవమని' వాషింగ్టన్‌ సుందర్‌ తెలిపాడు.

ఐపీఎల్ పూర్తి సమాచారం పట్టిక రూపంలో.. క్లిక్ చేయండి.

ఐపీఎల్ 2017 సీజన్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన వాషింగ్టన్ సుందర్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వెలుగులోకి వచ్చాడు. సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఆ సీజన్‌లో జట్టుకి దూరమవడంతో అతని స్థానంలో ఆడిన సుందర్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ పర్యవేక్షణలో రాటుదేలాడు. దీంతో గత ఏడాదే టీమిండియా నుంచి కూడా పిలుపొచ్చింది. శ్రీలంకతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లో ఈ తమిళనాడు స్పిన్నర్ మెరిశాడు.

ధోని దగ్గర నేర్చుకున్న మెళుకువలు ఆర్సీబీ జట్టుకు ఎంపిక చేశాయని, ఈ జట్టులో సైతం సీనియర్‌ ప్లేయర్ల ఆటను దగ్గర నుంచి చూసి మరింత నేర్చుకుంటున్నాని ఈ 18 ఏళ్ల యువస్పిన్నర్‌ చెప్పుకొచ్చాడు. తన లక్ష్యం మాత్రం భారత జట్టులో చోటు సంపాదించుకోవడమేనని, ఇందుకోసం వచ్చిన ప్రతి అవకాశాన్నిసద్వినియోగం చేసుకుంటానన్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 10:30 [IST]
Other articles published on Jan 29, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+