Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : కోహ్లీని ఎగ్జయిట్ చేసిన ఫుడ్ అదే.. వైరల్ వీడియోపై నోరు విప్పిన ద్రావిడ్

Dravid reveals food which made Kohli all excited

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు అద్భతమైన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో కొంత వెనుకబడినా కూడా అక్షర్ పటేల్ 74 పరుగులతో ఆదుకోవడంతో భారత జట్టు 262 పరుగులు చేయగలిగింది. కేవలం ఒక పరుగు ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాను జడేజా ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు ఆ జట్టు 113 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 115 పరుగుల లక్ష్యం నిలిచింది.

వరుసగా రెండో టెస్టు కూడా..

వరుసగా రెండో టెస్టు కూడా..

స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టు అద్భుతంగా ఆడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (31) టీ20 తరహా ఆటతో చెలరేగాడు. అయితే భారత జట్టు కూడా నాలుగు వికెట్లు కోల్పోవడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన కీపర్ కేఎస్ భరత్ (23 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివరకు పుజారా విన్నింగ్ రన్స్ చేయడంతో భారత్ గెలిచింది. మ్యాచ్ అనంతరం ఇంటర్వ్యూ ఇచ్చిన రాహుల్ ద్రావిడ్ ఒక కీలక విషయం చెప్పాడు. తమ జట్టు వ్యూహాలు తదితరాలతోపాటు అభిమానులకు పిచ్చెక్కించిన ప్రశ్నకు సమాధానం తెలిపాడు.

ఫుడ్ చూసి కోహ్లీ ఎగ్జయిట్..

ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సమయంలో ద్రావిడ్‌తో ఏదో విషయంపై కోహ్లీ తెగ చర్చిస్తున్నాడు. ఇలాంటి సమయంలో అతనికి కావలసిన లంచ్ ఆర్డర్ వచ్చిందని స్టాఫ్ వచ్చి చెప్పారు. అది విన్న కోహ్లీ చాలా ఎగ్జయిట్ అయిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఆ లంచ్ బాక్సును లోపల పెట్టాలని స్టాఫ్‌కు చెప్పి, తను ద్రావిడ్‌తో తన చర్చను కొనసాగించాడు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవడంతో అభిమానులు ఆ లంచ్ బాక్సులో ఏముందని చర్చ మొదలు పెట్టారు. కోహ్లీ ఫేవరెట్ డిష్ 'ఛోలే బతూరే' వచ్చి ఉంటుందని అనుకున్నారు.

అసలు విషయం ఇదే..

అయితే మ్యాచ్ అనంతరం ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రావిడ్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. ఇంటర్వ్యూ ముగించడానికి ముందు మరో ముఖ్యమైన ప్రశ్న ఉందన్న యాంకర్ మయంతి లంగర్.. 'కోహ్లీని అంత ఎగ్జయిట్ చేసిన ఫుడ్ ఏది? ఛోలె బతూరేనా?' అని అడిగింది. దీనికి నవ్వేసిన ద్రావిడ్ అసలు విషయం చెప్పాడు. 'అది ఛోలె బతూరే కాదు. ఛోలె కుల్చా. నన్ను కూడా దాంతో టెంప్ట్ చెయ్యాలని చూశాడు. కానీ నాకు యాభై ఏళ్లు. నా వల్ల కాదు అని చెప్పా' అని ద్రావిడ్ సమాధానం ఇచ్చాడు.

ఛోలే బతూరే ఎందుకంటే?

అంతకుముందు 2016లో గౌరవ్ కపూర్‌కు కోహ్లీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సమయంలో ఇష్టమైన వంటకం ఏదని గౌరవ్ అడిగాడు. అప్పుడే ఛోలే బతూరే అంటే తనకు చాలా ఇష్టమని కోహ్లీ చెప్పాడు. 'రాజౌరీ గార్డెన్‌లో ఉండే రామ్స్ ఛోలే బతూరే.. అక్కడి డిష్ అంటే 110 శాతం ఇష్టం. అది కూడా నేనే అక్కడకు వెళ్లి తింటా. పార్శిల్ తెచ్చుకుంటూ బతూరే.. బతూరేలా ఉండదు. ఏదో చల్లబడిపోయిన రొట్టెలా ఉంటుంది. వేడి వేడిగా ఉన్న బతూరాకు మన వేలితో చిల్లు పెట్టుకొని ఉల్లిపాయ, కొంచెం పుదీనా చట్నీ, మిరియాల పొడి వేసుకొని తింటుంటే.. అబ్బో అదే చాలు' అని కోహ్లీ చెప్పాడు.

Story first published: Sunday, February 19, 2023, 21:30 [IST]
Other articles published on Feb 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+