ధోనీ సేనపై ద్రావిడ్ ప్రశంసల జల్లు
బెంగుళూర్: ట్వంటీ 20 ప్రపంచ కప్ పోటీల్లో భారత విజయంపై ఎట్టకేలకు భారత క్రికెట్ జట్టు తాజా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ నోరు విప్పారు. ధోనీ సేనను ప్రశంసలతో ముంచెత్తారు. ధోనీ సేన భారతదేశానికే గర్వకారణమని ఆయన శుక్రవారం అన్నారు. ట్వంటీ 20 మ్యాచుల్లో భారత జట్టు విశేష ప్రతిభ కనబరిచిందని ఆయన అన్నారు.రాబోయే మ్యాచుల్లో కూడా భారత ఆటగాళ్లు బాగా ఆడతారని ఆయన అన్నారు. ట్వంటీ 20 పోటీల్లో భారత ఆటగాళ్లందరూ బాగా ఆడారని ఆయన అన్నారు. ట్వంటీ 20 ప్రపంచ కప్ లో గెలిచిన వెంటనే మరో ఇద్దరు సీనియర్ క్రీడాకారులు సచిన్ టెండూల్కర్, సౌరబ్ గంగూలీ ధోనీ సేనను అభినందించారు. ధోనీని ప్రశంసించారు. ద్రావిడ్ మాత్రం ఇప్పటి వరకు మౌనంగానే ఉన్నారు. ఆస్ట్రేలియాతో రేపు తొలి వన్డే మ్యాచ్ జరుగనున్న నేపథ్యంలో ద్రావిడ్ ధోనీ సేనను అభినందించారు.
Story first published: Friday, September 28, 2007, 23:53 [IST]
Other articles published on Sep 28, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications