Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాహుల్ ద్రావిడ్ ఐపియల్ 2 ఫైనల్లో భయపడ్డాడు: గిబ్స్

Herschelle Gibbs
జోహెన్నెస్ బర్గ్: రాయల్ చాలెంజర్స్ కు, దక్కన్ చార్జర్స్ మధ్య జరిగిన ఐపియల్ 2 ఫైనల్లో రాహుల్ ద్రావిడ్ భయాందోళనకు గురయ్యాడని గిబ్స్ అభిప్రాయపడ్డాడు. టు ది పాయింట్ పేర రాసిన ఆత్మకథలో అతను ఈ అభిప్రాయం వ్యక్తం చేశాడు. హర్మీత్ సింగ్ వేసిన బంతికి అనవసరమైన షాట్ కు వెళ్లాడని, భయాందోళన వల్లనే ద్రావిడ్ ఆ విధమైన షాట్ కొట్టాడని అతను అన్నారు. గిబ్స్ ఆత్మకథ సోమవారం విడుదలైంది. ద్రావిడ్ అనేక మ్యాచుల్లో ఒత్తిడిని తట్టుకుని ఆడాడని, ద్రావిడ్ కు ఆ శక్తి ఉందని, అయితే రాయల్ చాలెంజర్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మాత్రం కీలకమైన దశలో ద్రావిడ్ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడని గిబ్స్ వివరించాడు.

2009లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కు, దక్కన్ చార్జర్స్ కు మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫలితాన్ని అంచనా వేయడం సాధ్యం కాలేదని, ఇటువంటి మ్యాచుల్లో ఎవరు ఒత్తిడి తట్టుకోగలరు, ఎవరు తట్టుకోలేరనేది ముఖ్యమవుతుందని, ఒత్తిడిలో చిన్న విషయాల్లో పొరపాటు జరుగుతుందని అతను అన్నాడు. తమ దక్కన్ చార్జర్స్ విజయం తనను ఆశ్చర్యపరిచిందని అతను అన్నాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+