Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రవిడ్ సెంచరీ మిస్: భారత్ 297/6

Rahul Dravid

పెర్త్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ద్రావిడ్ 93 పరుగులు చేసి సెంచరీ మిస్సయ్యాడు. అతను సైమండ్స్ బౌలింగ్‌లో పాంటింగ్ పట్టిన క్యాచ్‌తో క్రీజు నుంచి నిష్క్రమించాడు. దీంతో భారత్ 278 పరుగుల వద్ద తన ఐదో వికెట్ కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి ధోనీ, పఠాన్ చెరో ఎనిమిది పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. లక్ష్మణ్ 28 పరుగులు చేసి బ్రెట్లీ బౌలింగులో అవుటయ్యాడు.

భారత జట్టులో సచిన్(71) అర్ధ సెంచరీ సాధించగా ఓపెనర్లు సెహ్వాగ్(29), జాఫర్(16), గంగూలీ(9)లు తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బ్రెట్‌లీ మూడు వికెట్లు తీసుకోగా, జాన్సన్ రెండు వికెట్లు సాధించాడు.సైమండ్స్ ఓ వికెట్ పడగొట్టాడు. అంతకుముందు టాస్ గెలిచి తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌ని జాన్సన్ తొలిదెబ్బ తీశాడు. ఆరు ఫోర్లతో 29 పరుగులు సాధించి మంచి ఊపు మీదున్న సెహ్వాగ్‌‌ జాన్సన్ బౌలింగ్‌లో గిల్‌క్రిస్ట్ పట్టిన క్యాచ్‌తో క్రీజు నుంచి నిష్క్రమించాడు. దీంతో భారత్ తన తొలి వికెట్ కోల్పోయింది. కొద్ది సేపటికే బ్రెట్‌లీ బౌలింగ్‌లో గ్రిల్‌కిస్ట్ పట్టిన క్యాచ్‌తో మరో ఓపెనర్ జాఫర్ సైతం పెవిలియన్ బాట పట్టాడు. దీంతో తక్కువ పరుగులకే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. అటుపై క్రీజులోకి వచ్చిన సచిన్, ద్రావిడ్‌లు అర్ధ సెంచరీలు సాధించడంతో భారత ఇన్నింగ్స్ కుదుటపడింది.

అయితే అర్ధ సెంచరీ సాధించి మంచి ఊపుమీదున్న సచిన్‌(71)ను బ్రెట్‌లీ ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. దీంతో భారత్ 198 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గంగూలీ(9) కూడా తక్కువ పరుగులకే జాన్సన్ బౌలింగ్‌లో వెనుతిరిగాడు.
Story first published: Wednesday, January 16, 2008, 17:53 [IST]
Other articles published on Jan 16, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+