Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసీస్ తో అమీతుమీకి భారత్ రెడీ

Rahul Dravid & Wasim Jaffer

మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో రేపటి నుంచి జరిగే తొలి టెస్టులో వసీం జాఫర్ తో కలిసి మాజీ భారత కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ఇన్నింగ్సును ప్రారంభించనున్నాడు. తుది జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ కు చోటు దక్క లేదు. ఆరో స్థానంలో యువరాజ్ సింగ్ దిగనున్నాడు. యువరాజ్ కు తుది జట్టులో స్థానం కల్పించే ఉద్దేశంతోనే ద్రావిడ్ తో ఇన్నింగ్సులను ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం.

భారత మరో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఇది వందో టెస్టు కానున్నది. దాదా మహా ఉత్పాహంగా కనిపిస్తున్నాడు. ఆసీస్ ను ఎదుర్కునే సత్తా తమకు ఉందని అంటున్నాడు. ఈ సందర్భంగా దాదాకు బిసిసిఐ జ్ఞాపికను సమర్పించనుంది. తన బౌలింగుపై కెప్టెన్సీ ప్రభావం ఉండదని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే అంటున్నాడు. తాను మొదట బౌలర్ నని, ఆ తర్వాతనే కెప్టెన్ ను అని ఆయన చెబుతున్నాడు. ఆస్ట్రేలియాను ధీటుగా ఎదుర్కుంటామనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నాడు.
Story first published: Tuesday, December 25, 2007, 23:53 [IST]
Other articles published on Dec 25, 2007
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+