Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ద్రావిడ్ సెంచరీ: 173 పరుగులకు వీరేంద్ర సెహ్వాగ్ ఔట్

Rahul Dravid
అహ్మదాబాద్: న్యూజిలాండ్ తో అహ్మదాబాద్ లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్స్ల్ లో భారత బ్యాట్స్ మన్ రాహుల్ ద్రావిడ్ గురువారం సెంచరీ సాధించాడు. టెస్టు మ్యాచుల్లో ద్రావిడ్ కు ఇది 30వ సెంచరీ. న్యూజిలాండ్ తో అతనికి ఇది ఐదో సెంచరీ. గౌతం గంభీర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ద్రావిడ్ మొదట చాలా స్లోగా ఆడాడు. ఆ తర్వాత కాస్తా వేగం పెంచాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన సెహ్వాగ్ 173 పరుగులు చేసి వెట్టోరీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పుడు భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 297 పరుగులు ఉంది. సెహ్వాగ్ అవుటైన తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ కు దిగాడు. ఈ వార్త రాసే సమయానికి సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకు భారత రెండు వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. ద్రావిడ్ 104 పరుగులు చేశాడు. సచిన్ రెండు పరుగులతో క్రీజులో ఉన్నాడు.

అంతకు ముందు భారత ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. సెహ్వాగ్ కు ఇది టెస్టు మ్యాచుల్లో 22వ సెంచరీ. న్యూజిలాండ్ బౌలర్లను ఆటాడుకున్నాడు. న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడుతూ బంతి బౌండరీలకు తరలించాడు. సెహ్వాగ్ బ్యాటింగ్ తో భారత్ తొలి ఇన్నింగ్సులో పటిష్ట స్థితికి చేరుకుంటోంది. గౌతం గంబీర్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్ చాలా మందకొడిగా ఆడుతున్నాడు. ద్రావిడ్ 86 బంతుల్లో కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. గురువారం భారత్ లంచ్ సమయానికి ఒక వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. లంచ్ తర్వాత సెహ్వాగ్ సెంచరీ సాధించాడు. గౌతం గంభీర్ జెస్సీ రైడర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. గంభీర్ 21 పరుగులు సాధించాడు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టుకు మిస్సయిన వివియస్ లక్ష్మణ్, గౌతం గంభీర్ మళ్లీ జట్టులోకి వచ్చారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+