PAK vs BAN: కోచ్‌తో పాకిస్థాన్ కెప్టెన్ డిష్యూం డిష్యూం (Video)
పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ తమ కోచ్ జేసన్ గిల్లెస్పీతో వాగ్వాదానికి దిగాడు. రావల్పండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ సంఘటన చోటు చేసుకుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్-కోచ్ గొడవ పడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కోచ్ గిల్లెస్సీపై షాన్ మసూద్ కోపంగా మాట్లాడిన తీరు వీడియోలో స్పష్టంగా కనిపించింది.
అయితే వారిద్దరు దేని గురించి చర్చించుకున్నారనే వివరాలు తెలియలేదు. మరోవైపు కోచ్‌తో మసూద్ వ్యవహరించిన తీరుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు మహ్మద్ రిజ్వాన్ విషయంలోనూ పాక్ కెప్టెన్ తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రిజ్వాన్ (171 నాటౌట్) డబుల్ సెంచరీకి అవకాశం ఇవ్వకుండా ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మసూద్ సెల్ఫిష్ ప్లేయర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు డ్రా దిశగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 448/6 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మహ్మద్ రిజ్వాన్ (171*), సౌద్ షకీల్ (141) సెంచరీలతో సత్తాచాటారు. షోరిఫుల్, హసన్ చెరో రెండు వికెట్లు తీశారు.
అనంతరం బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 565 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముష్ఫికర్ రహీమ్ (191) తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. శద్మాన్ ఇస్లామ్ (93), మెహదీ హసన్ (77) రాణించారు. నసీమ్ షా మూడు, షాహీన్ అఫ్రిది, షాజాద్, మహ్మద్ అలీ తలో రెండు వికెట్లు తీశారు. కాగా, 117 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాకిస్థాన్ నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. షఫిక్ (12), మసూద్ (9) క్రీజులో ఉన్నారు. పాక్ ఇంకా 94 పరుగుల లోటులో ఉంది.
Shan Masoods Animated discussion with Gillespie!!! Something brewing in Pak Cricket ..#PakistanCricket #PAKvBAN pic.twitter.com/VnIa2qtEKI
— Rakesh (@raku035) August 24, 2024
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications