Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Pakistan Team: కొత్త కోచ్ రాగానే పాకిస్థాన్‌లో మళ్లీ డ్రామా షురూ!

Pakistan Team: పాకిస్థాన్ క్రికెట్ జట్టులో డ్రామా ముగిసే సూచనలు కనిపించడం లేదు. కొత్త టోర్నమెంట్లతో పాటు బోర్డు, నిర్వహణ స్థాయిలో మార్పులు సర్వసాధారణం. కానీ గత కొన్ని సంవత్సరాలుగా కోచ్‌లు, కెప్టెన్లు కూడా ఈ జాబితాలో చేర్చబడ్డారు. గ్యారీ కిర్‌స్టెన్, జాసన్ గిల్లెస్బీ, మిక్కీ ఆర్థర్ వంటి అనేక మంది పేర్లు తొలగించబడ్డాయి లేదా బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చింది. ఇప్పుడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మైక్ హెస్సన్ పాకిస్థాన్ జట్టుకు కొత్త అయ్యాడు. ఇటీవల మైక్ హెస్సన్ టీ20 జట్టులోకి బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను తిరిగి జట్టులోకి తీసుకురావాలని డిమాండ్ చేశాడు.

టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా సల్మాన్ అలీ ఆఘా
గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ లో పేలవమైన ప్రదర్శన తర్వాత మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలను టీ20 జట్టు నుంచి తొలగించారు. సల్మాన్ అలీ ఆఘా కొత్త కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆఘా నాయకత్వంలో జట్టు కొన్ని సిరీస్‌లు కూడా ఆడింది. కానీ ఇప్పుడు హెస్బన్ బాబర్, రిజ్వాన్‌లు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. పాకిస్థాన్ టీ20 కోచ్ మైక్ హెస్సన్ బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లను టీ20లలో మరోసారి పరీక్షించాలనుకుంటున్నాడు.

Drama Resumes with Pakistan s New Coach Mike Hesson s Demands for Babar Azam and Mohammad Rizwan s Return

బాబర్, రిజ్వాన్ తరఫున వాదించిన హెస్బన్
ఈ వారం సెలెక్టర్లతో జరిగిన సంభాషణలో హెస్సన్ మాట్లాడుతూ.. బాబర్, రిజ్వాన్‌లను టీ20 జట్టులోకి తిరిగి తీసుకురావాలని సమర్థించారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డులోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మాజీ కెప్టెన్లు ఇద్దరూ ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు తొలగించబడ్డారు. న్యూజిలాండ్ పర్యటనకు ముందు మహ్మద్ రిజ్వాన్ ను జాతీయ టీ20 కెప్టెన్‌గా తొలగించారు. పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ చేతిలో 1-4 తేడాతో ఓడిపోయింది. దీనికి ముందు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో కూడా ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.

సెలక్టర్లతో హెస్సన్ ఇలా అన్నాడు..
'బాబర్, రిజ్వాన్ తమ అనుభవంతో జట్టుకు ఇంకా చాలా అందించగలరని తాను భావిస్తున్నానని హెస్సన్ సెలెక్టర్లకు చెప్పాడు' అని ఆ వర్గాలు తెలిపాయి. టీ20లో హెస్సన్ తన భవిష్యత్తును నిర్ణయించుకునే ముందు వారికి మరో అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. బాబర్, రిజ్వాన్‌లను భవిష్యత్ టీ20 ప్రణాళికలలో చేర్చడంపై సీనియర్ సెలెక్టర్ ఆకిబ్ జావేద్ సందేహాలు వ్యక్తం చేశారని.. అయితే వారి అనుభవం అమూల్యమైనది కాబట్టి ఫార్మాట్‌లో వారిని పరీక్షించాలని హెస్సన్ పట్టుబట్టారని ఆ వర్గాలు వెల్లడించాయి.

టీ20 జట్టులోకి తిరిగి రావచ్చు..
'బంగ్లాదేశ్‌తో జరిగే స్వదేశీ సిరీస్ కోసం ఈ నెలలో ప్రకటించబడే జట్టులోకి వారిద్దరూ తిరిగి వచ్చే అవకాశం ఉంది' అని ఆ వర్గాలు తెలిపాయి. మే చివరలో లాహోర్, ఫైసలాబాద్‌లలో స్వదేశంలో పాకిస్తాన్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. హెస్సన్ గతంలో ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోచ్, క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేశాడు, కానీ జట్టు పేలవమైన ప్రదర్శన తర్వాత ఆయనను జట్టు నుండి విడుదల చేశారు. హెస్సన్ ప్రస్తుతం పీఎస్ఎల్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన ఇస్లామాబాద్ యునైటెడ్ ప్రధాన కోచ్‌గా కూడా ఉన్నాడు.

మూడేళ్లలో ఐదో విదేశీ కోచ్
2023 తర్వాత పాకిస్తాన్ జట్టుకు నియమితులైన ఐదవ విదేశీ ప్రధాన కోచ్ మైక్ హెస్సన్. గ్రాంట్ బ్రాడ్‌బర్న్, మిక్కీ ఆర్థర్, సైమన్ హెల్మ్, గ్యారీ కిర్‌స్టెన్, జాసన్ గిల్లెస్పీ కూడా ఆ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. బ్రాడ్‌బర్న్, ఆర్థర్, కిర్‌స్టెన్ మరియు గిల్లెస్పీ అందరూ తమ ఒప్పందాలను పూర్తి చేయకుండానే రాజీనామా చేశారు, అయితే హెల్మ్స్ 2023 ప్రారంభంలో ఆస్ట్రేలియా పర్యటనకు మాత్రమే హై పెర్ఫార్మెన్స్ కోచ్‌గా నియమితులయ్యారు.

ఆ పాత్రను ఆకిబ్ జావేద్ కు ఇచ్చారు..
విదేశీ కోచ్ లు రాజీనామా చేయడం.. పీసీబీ పనితీరు, దానితో వారి సంబంధాల పట్ల అసంతృప్తిని సూచిస్తుంది. పురుషుల జట్టుకు సంబంధించిన సహాయక సిబ్బందిని పీసీబీ పదేపదే మార్చింది. అందులో ప్రధాన కోచ్ పదవి కూడా ఉంది. ఆకిబ్ జావేద్ కాకుండా.. సక్లైన్ ముష్తాక్, మహ్మద్ హఫీజ్ కూడా జాతీయ జట్టుకు డైరెక్టర్ లేదా ప్రధాన కోచ్‌గా పని చేశారు కానీ విజయం సాధించలేదు. జాతీయ క్రికెట్ అకాడమీ కొత్త డైరెక్ట‌ర్‌గా ఆకిబ్ జావేద్ ను పీసీబీ నియమించింది.

Story first published: Monday, May 19, 2025, 15:12 [IST]
Other articles published on May 19, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+