Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన ఆయుష్ బదోని..గేల్ ప్రపంచ రికార్డు బద్దలు (Video)

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20లో లక్నో సూపర్ జెయింట్స్ యువ బ్యాటర్ ఆయుష్ బదోని విశ్వరూపం చూపించాడు. సౌత్ ఢిల్లీ తరఫున ఆడుతున్న నార్త్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ రికార్డులు బద్దలుకొట్టాడు. టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డును తునాతునకలు చేశాడు.

అరుణ్ జైట్లీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ఆయుష్ బదోని విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 55 బంతుల్లో 165 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 19 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఓ ఇన్నింగ్స్‌లో గేల్ (18 సిక్సర్లు) పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల ప్రపంచ రికార్డు బ్రేక్ అయ్యింది.

DPL 2024 Six-Machine Ayush Badoni Breaks Chris Gayle s Record for Most Sixes in a T20 Knock

2017లో బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో రంగ్‌పుర్ రైడర్స్‌ తరఫున బరిలోకి దిగిన గేల్ ఓ ఇన్నింగ్స్‌లో 18 సిక్సర్లు బాదాడు. ఈ రికార్డును ఏడేళ్ల తర్వాత ఆయుష్ బదోని బ్రేక్ చేశాడు. ఆయుష్‌తో పాటు ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కూడా నార్త్ ఢిల్లీపై శతకంతో చెలరేగాడు. 50 బంతుల్లో 120 పరుగులుసాధించాడు. 10 ఫోర్లు, 10 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో ప్రియాన్ష్ ఒకే ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లతో ఊచకోతకు దిగాడు.

వీరిద్దరు రెండో వికెట్‌కు 286 పరుగుల రికార్డు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. టీ20 క్రికెట్‌లో ఏ వికెట్‌కు అయినా ఇదే అత్యధిక భాగస్వామ్యం. అలాగే సౌత్ ఢిల్లీ టీ20ల్లో రెండో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. అగ్రస్థానంలో నేపాల్ ఉంది. ఆసియా క్రీడల్లో మంగోలియాపై నేపాల్ 314/3 స్కోరు సాధించింది. కాగా, నార్త్ ఢిల్లీపై సౌత్ ఢిల్లీ 112 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.

Story first published: Saturday, August 31, 2024, 19:49 [IST]
Other articles published on Aug 31, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+