

న్యూ ఢిల్లీ: భారత ఓపెనర్ మురళీ విజయ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టులో విజయ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. ఒకే టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌటైన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు విజయ్. లార్డ్స్ టెస్టులో ఎలాగైనా గెలవాలని అనుకున్న భారత్ ఘోర పరాజయం పాలైంది. ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది.
ఈ క్రమంలో నెటిజన్లు వరుసగా తిట్ట దండకం మొదలుపెట్టారు. కేఎల్ రాహుల్.. మురళీ విజయ్‌లను ఏకీపారేస్తున్నారు. వారికంటే ధావన్‌యే బెటర్ అంటూ సూచనలిస్తున్నారు కూడా. ఇలా భారత ఓటమితో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. డీన్ ఎల్గర్ కంటే చెత్తగా మురళీ విజయ్ ఆడుతున్నాడు. వీలైనంత త్వరగా అతన్ని జట్టులో నుంచి తీసేయ్యండి.
'మురళీ విజయ్‌కు ఇచ్చిన అవకాశాలు ఇక చాలు. దీంతో ఒక అతడి కెరీర్ ముగిసినట్లే. వెరీ పూర్.' , 'కేఎల్ రాహుల్-మురళీ విజయ్‌ల స్థానంలో బీసీసీఐ స్మృతి మంధాన-హర్మన్‌ప్రీత్ కౌర్‌కు చోటివ్వాలి'. వీరిద్దరూ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న కియా సూపర్‌లీగ్‌లో అద్భుతంగా ఆడుతున్నారు. 'కేఎల్ రాహుల్, మురళీ విజయ్ కంటే ధావనే కాస్త నయం. సొంతగడ్డపైనే భారత్ నంబర్ వన్ జట్టా', 'మురళీ విజయ్‌కు కాస్త విశ్రాంతి కావాలి. అతన్ని మిగతా సిరీస్ నుంచి తప్పించండి'
'మురళీ విజయ్ ఇక రిటైరవ్వు. మనీశ్ పాండే, కేదార్ జాదవ్, శ్రేయాస్ అయ్యర్, పృథ్వీ షాలు టెస్టు క్రికెట్ ఆడేందుకు అర్హులు.' 'భారత్ తరఫున మురళీ విజయ్ మరోసారి ఆడటం చూడాలని అనుకోవట్లేదు. అతని స్థానంలో యువ ఆటగాడికి చోటివ్వండి.' 'మురళీ విజయ్ స్థానంలో అనుష్క శర్మకు చోటివ్వండి', 'టీమిండియా జట్టును చూస్తే జాలేస్తోంది' అంటూ ట్వీట్లు చేస్తున్నారు.