Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వద్దు.. బుడ్డోడిని ఇప్పుడే టీమిండియాలోకి తీసుకురావద్దు!: స్టార్ క్రికెటర్

భారత క్రికెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు మారుపోగిపోతోంది. ఐపీఎల్ 2026లో తన దూకుడైన బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ కుర్రాడు.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఒకవేళ వైభవ్ జట్టులోకి వస్తే 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఈ యువ ప్లేయర్ భవిష్యత్తుపై స్పందిస్తూ పలు కీలక సూచనలు చేశాడు.

బుడ్డోడి ప్రతిభను కొనియాడిన ఆసీస్ దిగ్గజం
వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ఆరోన్ ఫించ్ కొనియాడాడు. వైభవ్ సూర్యవంశీని ఓ 'అద్భుతమైన సూపర్ స్టార్'గా అభివర్ణించాడు. అయితే అతడిని జట్టులోకి తీసుకునే విషయంలో తొందరపడకూడదని హితవు పలికాడు. "ఆ కుర్రాడిని ప్రశాంతంగా ఆడుకోనివ్వండి.. ఇప్పుడే అతడిపై అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని మోపకండి. ఆటను నేర్చుకునేందుకు, తనను తాను మెరుగుపరుచుకునేందుకు అతడికి సమయం ఇవ్వాలి" అని ఫించ్ పేర్కొన్నాడు. వైభవ్ చాలా వేగంగా విషయాలను నేర్చుకుంటాడని, ప్రతి మ్యాచ్‌కు కొత్త ప్రణాళికలతో రావడం వైభవ్ సూర్యవంశీ పరిణతికి నిదర్శనమని ప్రశంసించాడు.

Don t Rush Vaibhav Suryavanshi Into Team India Aaron Finch Warns Ahead of IPL 2026 Sensation

ఇలా చేస్తే బెటర్: ఆరోన్ ఫించ్
టీమిండియాలో చోటు కల్పించడంపై ఆరోన్ ఫించ్ స్పందిస్తూ.. ప్రస్తుతం భారత జట్టులో నిలకడగా రాణిస్తున్న సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలని గుర్తుచేశాడు. భారత్ తరఫున ఆడటం అనేది ప్రపంచంలోనే అత్యంత ఒత్తిడితో కూడుకున్న పని అని, అందుకే వైభవ్‌ను ఇప్పుడే తుది జట్టులోకి తీసుకోకుండా, సీనియర్ల మధ్య ఉండే వాతావరణాన్ని అలవాటు చేసేందుకు 'స్క్వాడ్' (జట్టు)లో భాగంగా ఉంచితే బాగుంటుందని సూచించాడు. ఎవరైనా సీనియర్ ప్లేయర్ గాయపడితే లేదా ఫామ్ కోల్పోతే మాత్రమే వైభవ్‌కు అవకాశం ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

మరోవైపు భారత సెలెక్టర్లు త్వరలో జరగబోయే ఐర్లాండ్ పర్యటన కోసం వైభవ్‌ సూర్యవంశీని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ పర్యటనకు ఎంపిక చేసిన 35 మంది టీ20 నిపుణుల జాబితాలో వైభవ్ సూర్యవంశీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకవేళ ఐర్లాండ్ సిరీస్‌లో అవకాశం రాకపోయినా, జింబాబ్వే పర్యటన లేదా జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల ద్వారా వైభవ్‌ను అంతర్జాతీయ వేదికపైకి తీసుకురావాలని బీసీసీఐ యోచిస్తోంది. వైభవ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో అన్నది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది.

Story first published: Thursday, April 16, 2026, 9:37 [IST]
Other articles published on Apr 16, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+