Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొతేరా స్టేడియం ప్రారంభోత్సవంకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్?!!

Donald Trump to inaugurate world’s largest cricket stadium in Ahmedabad

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని మొతేరా వద్ద నిర్మితమయిన విషయం తెలిసిందే. 'మొతేరా'ను సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్టేడియంగా పేరు మార్చారు. లక్షకు పైగా మంది కూర్చొనే ఈ స్టేడియం ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం కంటే పెద్దది. మొతేరా స్టేడియం దాదాపు సిద్దమయింది. అయితే ఈ మొతేరా క్రికెట్‌ స్టేడియాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రారంభించనున్నారని సమాచారం.

మొతేరా ప్రారంభానికి ట్రంప్‌:

మొతేరా ప్రారంభానికి ట్రంప్‌:

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానంపై డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఢిల్లీలో మాత్రమే పర్యటన కొనసాగాలని తొలుత భావించినప్పటికీ.. అనంతరం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా పర్యటించాలని ట్రంప్ నిర్ణయించారు. అహ్మదాబాద్‌ పర్యటన సందర్భంగా ట్రంప్‌.. మొతేరా క్రికెట్‌ స్టేడియాన్ని ప్రారంభించనున్నారట. ట్రంప్‌తో పాటు ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ కూడా భారత పర్యటనకు వస్తున్నారు.

భారత పర్యటన కోసం ఆసక్తిగా ఉన్నా:

భారత పర్యటన కోసం ఆసక్తిగా ఉన్నా:

భారత పర్యటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. తన పర్యటన సందర్భంగా భారత్‌, అమెరికా ఒక వాణిజ్య ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని తెలిపారు. అమెరికా అధ్యక్ష నివాసం శ్వేత భవనం వద్ద మంగళవారం రాత్రి ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ..'మోడీ గొప్ప వ్యక్తి. భారత్‌కు వెళ్లడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. భారత్‌తో సరైన ఒప్పందం చేసుకోగలిగితే.. సంతకం చేస్తా' అని అన్నారు.

లక్షల సంఖ్యలో జనం:

లక్షల సంఖ్యలో జనం:

'మోడీతో మాట్లాడాను. అహ్మదాబాద్‌లో వేల మంది భారతీయులు నాకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారట. లక్షల సంఖ్యలో జనం వస్తారని మోడీ చెప్పారు. విమానాశ్రయం నుంచి కొత్త స్టేడియం వరకు 50 లక్షల నుంచి 70 లక్షల మంది నాకు స్వాగతం పలుకవచ్చు. ఆ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దది. మోడీ ఇప్పుడు దానిని నిర్మిస్తున్నారు' అని ట్రంప్‌ చెప్పారు.

 రోడ్‌ షో అనంతరం ప్రారంభోత్సవం:

రోడ్‌ షో అనంతరం ప్రారంభోత్సవం:

హ్యూస్టన్‌లో జరిగిన 'హౌడీ మోడీ' కార్యక్రమం తరహాలో అహ్మదాబాద్‌లో కూడా ఓ భారీ రోడ్‌ షోకు సన్నాహాలు జరుగుతున్నాయి. సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించనున్న ట్రంప్‌.. ఆ తర్వాత కొత్తగా నిర్మించిన మోతెరా క్రికెట్‌ స్టేడియాన్ని ప్రారంభిస్తారు. మోతెరా స్టేడియాన్ని రూ.70 కోట్లతో నిర్మించారు. మొత్తం 63 ఎకరాల స్థలంలో ఉన్న ఈ స్టేడియంలో ఒకేసారి 1.10 లక్షల మంది కూర్చోవచ్చు. మెల్‌బోర్న్ స్టేడియం కెపాసిటీ 90వేలు.

Story first published: Thursday, February 13, 2020, 8:51 [IST]
Other articles published on Feb 13, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+