ట్రంప్ ప్రసంగంలో క్రికెట్ ప్రస్తావన.. సచిన్, కోహ్లీల గురించి ఏమన్నారంటే?!!

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత పర్యటన కోసం సోమవారం ఉదయం అహ్మదాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా వచ్చారు. అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో భారత ప్రధాని నరేంద్ర మోడీ వారికి స్వయంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి మోతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్లు రోడ్ షోలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు.

క్రీడారంగం గురించి గొప్పగా:
రోడ్ షో అనంతరం డొనాల్డ్ ట్రంప్ గుజరాత్‌లోని మొతెరా స్టేడియానికి చేరుకున్నారు. ట్రంప్ రాక సందర్భంగా స్టేడియంలోని జనాలు చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం ట్రంప్ తన ప్రసంగంను ప్రారంభించారు. తన ప్రసంగంలో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, క్రీడారంగం గురించి గొప్పగా మాట్లాడారు. ప్రపంచంలోని అతిపెద్ద ఫుట్‌బాల్ మైదానంలో మేము నరేంద్ర మోడీకి సభ ఏర్పాటు చేసాం. అందుకు బదులుగా ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ మైదానం మోతెరాలో మాకు సభ ఏర్పాటు చేశారని కొనియాడారు.

సచిన్, కోహ్లీ భారతీయులే:
ట్రంప్ తన ప్రసంగంలో భారత క్రికెట్ గురించి కూడా మాట్లాడారు. అంతర్జాతీయ క్రికెట్లో మేటి ఆటగాళ్లైన సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ భారతీయులే అని ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా వీరికి అభిమానులు ఉన్నారు. గొప్ప గొప్ప క్రికెటర్లను క్రికెట్‌కు భారత దేశం అందించిందన్నారు. మన ఆటగాళ్ల గురించి ట్రాంప్ ప్రస్తావించడంతో స్టేడియంలోని ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అదే సమయంలో చప్పట్లతో హర్షం వ్యక్తం చేసారు. సోమవారం నుంచి ఈ స్టేడియం అందుబాటులోకి వస్తుందని సమాచారం తెలుస్తోంది.
సీటింగ్ కెపాసిటీ లక్షా పది వేలు:
మొతెరా స్టేడయంను సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంగా పిలుస్తారు. ఇది భారత దేశంలోని పురాతన స్టేడియాల్లో ఒకటి. అయితే ప్రపంచంలోకెల్లా అత్యంత పెద్ద స్టేడియాన్ని నిర్మించాలనే ఆలోచనతో గుజరాత్ క్రికెట్ సంఘం ఐదేళ్ల కిందట మొతెరా స్టేడియాన్ని కూలగొట్టి కొత్తగా నిర్మించారు. దీని సీటింగ్ కెపాసిటీ లక్షా పది వేలు. ప్రస్తుతం అతిపెద్ద స్టేడియం రికార్డు ఆస్ట్రేలియాలోని ప్రఖ్యాత మెల్‌బోర్న్ స్టేడియం పేరిట ఉంది. ఆ స్టేడియం కెపాసిటీ 90 వేలు. ఇప్పుడు అతిపెద్ద స్టేడియంగా మొతేరా నిలవనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications