Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బేబి రుత్‌తో పోలిక: డొనాల్డ్ ట్రంప్‌కు బ్రాడ్‌మన్ ఎవరో తెలియదట!

Donald Trump comes to know about Sir Don Bradman for the first time in a hilarious way

హైదరాబాద్: సర్ డొనాల్డ్ జార్జి బ్రాడ్‌మన్... క్రికెట్ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు డాన్ బ్రాడ్‌మన్. ఆస్ట్రేలియా తరుపున సుమారు 20 ఏళ్ల పాటు క్రికెట్ ఆడారు. ప్రపంచంలోని దిగ్గజ క్రికెటర్లలో ఒకరు. అలాంటి వ్యక్తి అమెరికా ప్రస్తుత అధ్యక్షడు డొనాల్డ్ ట్రంఫ్‌కు తెలియదట.

ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవలే డొనాల్డ్ ట్రంప్ ఒహియో పర్యటనలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్, ఆస్ట్రేలియన్ బిలియనీర్ ఆంటోనీ ప్రాట్ మధ్య జరిగిన సంభాషణలో లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్ మన్ పేరు వచ్చింది. ఈ సందర్భంలో డాన్ బ్రాడ్‌మన్ ఎవరో తెలియక డొనాల్డ్ ట్రంప్ కాస్త గందరగోళంలో పడ్డారు.

అసలేం జరిగిందంటే!

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మొర్రిసన్‌ను డొనాల్డ్ ట్రంప్‌కు పరిచయం చేసే క్రమంలో ప్రాట్ అతడిని 'ఉద్యోగాలు సృష్టించడంలో ఇతడు ఆస్ట్రేలియా డాన్ బ్రాడ్‌మన్' అని సంబోధించాడు. దీంతో డొనాల్డ్ ట్రంప్‌కు డాన్ బ్రాడ్‌మన్ ఎవరో తెలియక పోవడంతో కాస్త గందరగోళానికి గురయ్యాడు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్‌కు బ్రాడ్ మన్ ఎవరో తెలియజేసే క్రమంలో "డాన్ బ్రాడ్‌మన్ మా బేబి రుత్" అని చెప్పాడు. బేబీ రుత్ ఎవరో కాదు అమెరికా లెజెండరీ ప్రొఫెషనల్ బేస్‌బాల్ ప్లేయర్. 1914 నుంచి 1935 వరకు తన అద్భుతమైన ఆటతో అమెరికన్లను అలరించాడు.

బేబి రుత్‌‌తో పోల్చిన బ్రాట్

క్రికెట్‌లో డాన్ బ్రాడ్‌మన్ లెజెండరీ ప్లేయర్ కావడంతో బేబి రుత్‌‌తో పోల్చి ట్రంప్‌కు అర్ధమయ్యేలా బ్రాట్ వివరించాడు. ఇక, డాన్ బ్రాడ్‌మన్ విషయానికి వస్తే టెస్టు క్రికెట్‌లో అత్యధిక యావరేజిని కలిగి ఉన్న ఏకైక క్రికెటర్. ఆస్ట్రేలియా తరుపున 52 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బ్రాడ్‌మన్ 99.94 యావరేజితో 6996 పరుగులు చేశాడు. అలాంటి బ్రాడ్‌మన్ గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసినప్పటికీ అమెరికా అధ్యక్షుడుకి తెలియకపోవడం విశేషం. అది కూడా ఓ ఫన్నీ సందర్భంలో అతడి గురించి డొనాల్డ్ ట్రంఫ్ తెలుసుకోవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అక్టోబర్‌లో భారత్‌కు వస్తా

అక్టోబర్‌లో భారత్‌కు వస్తా

కాగా, అక్టోబర్ నెలలో జరిగే తొలి ఎన్‌బీఏ బాస్కెట్ బాల్ మ్యాచ్ కోసం భారత్‌కు వస్తా అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఉన్న ఎన్‌ఆర్జీ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన 'హౌడీ-మోడీ' సభ అట్టహాసంగా జరిగిన సంగిత తెలిసిందే. 'ఉమ్మడి స్వప్నాలు, ఉజ్వల భవిష్యత్తు' అన్న ట్యాగ్‌లైన్‌తో టెక్సాస్‌ ఇండియా ఫోరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

ఎన్‌బీఏ బాస్కెట్ బాల్‌ను భారత్‌కు పరిచయం

ఎన్‌బీఏ బాస్కెట్ బాల్‌ను భారత్‌కు పరిచయం

భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హాజరయ్యారు. ఎన్‌బీఏ బాస్కెట్ బాల్‌ను భారత్‌కు పరిచయం చేయనున్నామని, వచ్చే నెలలో ముంబైలో ఎన్‌బీఏ మ్యాచ్‌ జరగనుందని ట్రంప్‌ తెలిపారు. డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ...'వచ్చే నెలలో భారత దేశంలో తొలి ఎన్‌బీఏ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ముంబై నగరం సిద్ధమవుతుంది. ముంబైలో వేలాది మంది మొట్టమొదటి ఎన్‌బీఏ ఆటను చూస్తారు. మోడీ ఆహ్వానిస్తే భారత్‌కు వస్తా?. నేనొస్తా కావొచ్చు, జాగ్రత్తగా ఉండండి' అని నవ్వుతూ అన్నారు.

Story first published: Wednesday, September 25, 2019, 13:33 [IST]
Other articles published on Sep 25, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+