For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఎవరో చెప్పారని చేయను.. అక్కడికి వెళ్లాక ఆలోచిస్తా'

Don’t want to preplan for wickets Down Under, says Jasprit Bumrah

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియా పర్యటన కోసం తానేమీ ప్రత్యేకంగా సిద్ధం కావట్లేదని భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో నవంబరు 21 నుంచి మూడు టీ20లు, నాలుగు టెస్టులతో పాటు మూడు వన్డేల సుదీర్ఘ సిరీస్‌ని భారత్ జట్టు ఆడనుంది. ఈ పర్యటన కోసం ఇప్పటికే జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లకి వెస్టిండీస్‌తో సిరీస్‌ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో పర్యటించిన భారత్ జట్టు.. ఆశించిన ఫలితాలను రాబట్టలేకపోయింది.

టెస్టు సిరీస్‌ గెలవాలని టీమిండియా

టెస్టు సిరీస్‌ గెలవాలని టీమిండియా

దీంతో.. కనీసం ఆస్ట్రేలియా పర్యటనలోనైనా టెస్టు సిరీస్‌ గెలవాలని టీమిండియా ఆశిస్తోంది. ఆస్ట్రేలియా పిచ్‌లపై సత్తాచాటేందుకు ఏవైనా ప్రత్యేక వ్యూహాలతో వెళ్తున్నారా..? అని జస్‌ప్రీత్ బుమ్రాని ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. తన బౌలింగ్‌ శైలిపై చేసే వ్యాఖ్యలను పట్టించుకోనని టీమిండియా డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు జస్ప్రీత్‌ బుమ్రా అన్నాడు. తనకు సౌకర్యంగా ఉన్న శైలినే కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. బుమ్రా బౌలింగ్‌ శైలి తరచూ గాయాల పాలయ్యేలా కనిపిస్తుందని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ అఖిబ్‌ జావెద్‌ అన్న సంగతి తెలిసిందే.

వెళ్లిన తర్వాత.. పిచ్‌‌ల గురించి అవగాహన

వెళ్లిన తర్వాత.. పిచ్‌‌ల గురించి అవగాహన

‘నేను ఆస్ట్రేలియాకి వెళ్లిన తర్వాత.. అక్కడి పిచ్‌‌ల గురించి అవగాహన తెచ్చుకుంటా. అలా కాకుండా.. ఇక్కడి నుంచి ప్రత్యేక వ్యూహాలతో వెళితే.. అవి తారుమారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఫ్రెష్‌గా అక్కడి వెళ్లి.. పిచ్‌లకి అనుగుణంగా.. ప్లానింగ్ చేసుకుంటా' అని బుమ్రా వెల్లడించాడు.

నాకేది సహాయం చేసిందో దానిపైనే శ్రద్ధ

నాకేది సహాయం చేసిందో దానిపైనే శ్రద్ధ

‘నిపుణులు ఏం చెప్తున్నారు ఏం చెప్పడం లేదని నేనెప్పుడూ దృష్టి సారించను. నాకేది సహాయం చేసిందో దానిపై శ్రద్ధ పెడతా. ఎల్లప్పుడూ దృఢంగా ఉంచుకొనేందుకు నా దేహంపై దృష్టిపెడతా. క్రికెట్‌లో ఒక స్పష్టమైన శైలి, లయ ఉండదు. ఒకవేళ ఉంటే గాయపడని బౌలర్‌ను చూపించండి. నా ఫిట్‌నెస్‌ స్థాయిని ఎలా మెరుగు పరచుకోవాలన్న దానిపైనే ఎల్లప్పుడూ దృష్టిసారిస్తా' అని బుమ్రా తెలిపాడు.

బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ మంచి సలహాలు

బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ మంచి సలహాలు

భారత్ జట్టు వెస్టిండీస్‌తో ఈనెల 21 నుంచి ఐదు వన్డేల సిరీస్ ఆడనుండగా.. ఇప్పటికే తొలి రెండు వన్డేల కోసం సెలక్టర్లు జట్టుని ప్రకటించారు. అయితే.. ఈ జట్టు నుంచి కూడా బుమ్రా, భువీకి వారు విశ్రాంతినిచ్చారు. ‘టీమిండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ మంచి సలహాలు ఇస్తారు. అండర్-19 శిబిరంలోనూ ఆయన వద్ద శిక్షణ తీసుకున్నా. నా బౌలింగ్ శైలి గురించి ఆయనకు బాగా తెలుసు. మ్యాచ్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరం అలసట నుంచి తేరుకుంటుంది. తాజాగా ఉంటుంది. మంచి లయ దొరుకుతుంది' అని బుమ్రా పేర్కొన్నాడు.

Story first published: Thursday, October 18, 2018, 17:21 [IST]
Other articles published on Oct 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+