న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాది సరైన గెలుపు కాదు: ప్రపంచకప్ ఫైనల్ విజయంపై ఇయాన్ మోర్గాన్

ICC Cricket World Cup 2019 : Eoin Morgan Finally Responded On World Cup 2019 Final Result | Oneindia
Dont think its fair to have a result like that: Eoin Morgan on World Cup 2019 final

హైదరాబాద్: లార్డ్స్ వేదికగా జులై 14న జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టు ఓటమి పాలైనప్పటికీ క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో చివరి వరకు అద్భుతంగా పోరాడినప్పటికీ... ఐసీసీ చెత్త రూల్ కారణంగా విజేత కాలేకపోయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

బౌండరీ రూల్ ప్రకారం ఇంగ్లాండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించడంపై కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ స్పందించాడు. టైమ్స్‌ మ్యాగజీన్‌తో మాట్లాడుతూ ఫైనల్‌ ఫలితం తమకు కూడా కష్టంగానే అనిపించిందని మోర్గాన్ పేర్కొన్నాడు. మ్యాచ్‌‍‌ విజేతను ఈ విధంగా నిర్ణయించడం సరైంది కాదని పేర్కొన్నాడు.

ఇరు జట్ల ప్రధాన స్కోరు సమం

ఇరు జట్ల ప్రధాన స్కోరు సమం

ప్రపంచకప్ ఫైనల్లో తొలుత ఇరు జట్లు ప్రధాన స్కోరు సమం అయ్యాయి. దీంతో మ్యాచ్ ఫలితం నిర్ణయించేందుకు సూపర్ ఓవర్‌ను నిర్వహించారు. సూపర్‌ ఓవర్‌లోనూ ఇరు జట్ల స్కోరు సమం అయిన నేపథ్యంలో బౌండరీ సంఖ్య ఆధారంగా ఆతిథ్య జట్టైన ఇంగ్లాండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

బౌండరీల నిబంధన ప్రకారం

బౌండరీల నిబంధన ప్రకారం

ఇరు జట్ల స్కోరు సమమైనప్పుడు.. ఇలా బౌండరీల నిబంధన ప్రకారం మ్యాచ్‌ ఫలితాన్ని తేల్చడం తన దృష్టిలో సరైంది కాదని మోర్గాన్‌ తేల్చి చెప్పాడు. దీనిపై మోర్గాన్ మాట్లాడుతూ "ఇరు జట్లు సమంగా పోరాడిన సమయంలో ఇలాంటి ఫలితాన్ని ప్రకటించడం నాకు సమంజసంగా అనిపించలేదు" అని అన్నాడు.

ఎక్కడ మేం గెలిచామో.. ఎక్కడ ఓడామో

ఎక్కడ మేం గెలిచామో.. ఎక్కడ ఓడామో

"నేను ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగిన విషయం నిజమే.. ఎక్కడ మేం గెలిచామో.. ఎక్కడ ఓడామో నేను చెప్పలేను. ఇలా గెలువడం మంచిదని నేను అనుకోను. ఈ తరహా ఓటమిని ఎవరు జీర్ణించుకోలేరు" అని ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. దీనిపై అనంతరం కివీస్ కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌తో అనేక సార్లు మాట్లాడానని చెప్పాడు.

ఇప్పటికీ అర్థం కాలేదు

ఇప్పటికీ అర్థం కాలేదు

అయితే, ఇది ఎలా జరిగిందో తమకు ఇప్పటికీ అర్థం కాలేదని, ఈ ఫలితంపై తాము ఓ నిర్ధారణకు రాలేకపోయామని ఇయాన్ మోర్గాన్ అన్నాడు. ఇక, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ సైతం ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఎవరూ ఓడిపోలేదని అన్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ నుంచి న్యూజిలాండ్‌కు చేరుకున్న తర్వాత అక్కడి మీడియాతో మాట్లాడుతూ "ఇంగ్లాండ్‌ జట్టు కప్పు గెలిచిన విజేత.. అంతే తేడా" అని చెప్పాడు.

Story first published: Saturday, July 20, 2019, 13:56 [IST]
Other articles published on Jul 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X