హైదరాబాద్: తన బౌలింగ్ టెక్నిక్‌పై టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రితో ఎక్కువగా మాట్లాడనని స్పిన్నర్ అక్షర్ పటేల్ స్పష్టం చేశాడు. అంతేకాదు రవిశాస్త్రి కూడా తనకు పెద్దగా సలహాలు ఇవ్వడని అక్షర్ పటేల్ పేర్కొన్నాడు.
రాజ్ కోట్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టీ20 శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం అక్షర్ పటేల్ మీడియాతో మాట్లాడాడు. 'నా బౌలింగ్ ఇలా ఉండాలని రవిశాస్త్రి ఎక్కువగా నాకు చెప్పరు. అదే సమయంలో నా బౌలింగ్ ను మార్చుకోమనే సలహా కూడా ఆయన కోరలేదు' అని అక్షర పటేల్ చెప్పుకొచ్చాడు.

'నేను జట్టులో చోటు సంపాదించడానికి ఏ రకంగా కష్టపడ్డానో అదే విధంగా కష్టపడమని చెబుతారు. ఒత్తిడి సమయంలో బౌలింగ్ ఎలా చేయాలనే దానిపై మాత్రమే మేం ఎక్కువగా మాట్లాడుకుంటాం. అంతేతప్ప బౌలింగ్ విషయంలో కోచ్ రవిశాస్త్రి ఎలాంటి సూచన చేయలేదు' అని అక్షర్ తెలిపాడు.
ఆయన నాకిచ్చే సలహా ఏదైనా ఉందంటే స్టంప్స్ గురి తప్పకుండా బౌలింగ్ చేయమనే సలహా మాత్రమేనని అన్నాడు. కాగా ఇరు జట్ల మధ్య రాజ్ కోట్ వేదికగా శనివారం రెండో టీ 20 జరుగనుంది. మూడు టీ20ల సిరిస్‌లో భారత్ ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో నిలిచిన సంగతి తెలిసిందే.