నా భార్యను ట్యాగ్ చేయొద్దు: ధోనికి నో థ్యాంక్స్‌పై అశ్విన్
హైదరాబాద్: గురువారం ఐసీసీ ప్రకటించిన వార్షిక అవార్డుల్లో 'క్రికెటర్ ఆఫ్ ద ఇయర్' అవార్డుతో పాటు టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కైవసం చేసుకుని అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. రాహుల్ ద్రవిడ్ తర్వాత ఒకే సంవత్సరంలో రెండు అవార్డులు సాధించిన రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.
ఈ ఏడాది అద్భుతమైన ఆటతీరుతో పాటు ఐసీసీ ప్రకటించిన వార్షిక అవార్డుల్లో రెండు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకుని రెట్టింపు ఆనందాన్ని పొందిన అశ్విన్‌కు కొత్త ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. ఈ రెండు ప్రతిష్టాత్మక అవార్డులకు ఎంపికైన తర్వాత అశ్విన్ ట్విట్టర్‌లో తన భార్య ప్రీతి, హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ట్రైనర్ బసు, శ్రీధర్, భరత్ అరుణ్ తదితరులకు కృతజ్ఞతలు చెప్పాడు.
అశ్విన్ అందరికీ థ్యాంక్స్ చెప్పాడని, ఒక్కరికి చెప్పలేదని ఓ అభిమాని మండిపడ్డాడు. తనకు చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడుతున్న సమయం నుంచి అండగా నిలిచి, ఎన్నో విషయాల్లో భుజం తట్టి నిలబడిన ధోనీ అశ్విన్‌కు గుర్తులేకపోవడం శోచనీయమని ట్వీట్ చేశాడు. మరో అభిమాని ధోనీని మర్చిపోయేంత క్రూరత్వం నీలో ఉందనుకోలేదని అశ్విన్‌ను ఉద్దేశించి ఘాటుగా ట్వీట్ చేశాడు.

ధోనిని మరిచిన అశ్విన్
అయితే పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం అశ్విన్ కృతజ్ఞతలు చెప్పలేదు. దాంతో అశ్విన్ శైలిపై ధోని అభిమానులు గుర్రుగా ఉన్నారు. భారత జట్టులో అశ్విన్ స్థానం సుస్ధిరం అవ్వడానికి, అశ్విన్ ఉన్నతికి ధోని ఎంతగానో ఉపయోగపడ్డాడని అలాంటి ధోనికి కృతజ్ఞతలు చెప్పడా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అశ్విన్‌పై ధోని అభిమానుల ఆగ్రహం
గత కొన్ని రోజులుగా ట్విట్టర్ వేదికగా ఇదే విషయమై అశ్విన్‌పై ధోని అభిమానులు విరుచుకుపడుతున్నారు. అటు భారత జట్టు, ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ధోని నేతృత్వంలోని జట్టులో అశ్విన్ ఆడిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి ముగింపు పలకాలనే ఉద్దేశ్యంతో ఆదివారం అశ్విన్ మరొకసారి ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు.
ట్విట్టర్‌లో వివరణ ఇచ్చుకున్న అశ్విన్
నేను దీనికి ముగింపు పలకాలని అనుకుంటున్నా. నా ఉన్నతికి ధోని ఎంతో కృషి చేశాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ధోని తరువాత టెస్టు కెప్టెన్ బాధ్యతలను కోహ్లి చేపట్టాడు. దాంతో పాటు కొత్త కుర్రాళ్ల కల్గిన భారత జట్టు ఇప్పుడు ఉంది. ఆ క్రమంలోనే ఇప్పటి జట్టును ఉద్దేశించే మాత్రమే నేను ట్వీట్ చేశాను కానీ, ధోనిని పక్కక పెట్టాలని కాదు. ఈ తరహా అవార్డులు తీసుకున్నప్పుడు ముందు కుటుంబానికి ప్రాముఖ్యతనిస్తాం. తర్వాత జట్టులోని ముఖ్యమైన సభ్యులు పేర్లు మాత్రమే ప్రస్తావిస్తాం అనేది నెటిజన్లు గ్రహించాలి' అని అశ్విన్ విజ్ఞప్తి చేశాడు.
నా భార్య ప్రీతి ట్యాగు చేయొద్దన్న అశ్విన్
చివరగా ధోని అభిమానులకు అశ్విన్ మరోక విన్నపాన్ని కూడా చేశాడు. ఫన్నీ ట్వీట్లలో తన భార్య ప్రీతి ట్యాగును పేర్కొన్నవద్దంటూ విన్నవించాడు. ఆమె చేయాల్సిన మంచి పనులు ఇంకా చాలా ఉన్నాయని, తానిప్పుడు ఆ పనిలోనే ఉన్నానని ట్వీట్ చేశాడు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టే దిశగా ట్వీట్స్ ఉన్నాయంటూ ఓ అభిమాని ట్వీట్‌ని రీట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications