WTC Final 2021: 'టీమిండియా వెంట పరిగెత్తకు.. అదే నిన్ను అనుసరిస్తుంది'

Ajinkya Rahane Reveals How Rahul Dravid Motivated Him | Oneindia Telugu

లండన్: టీమిండియా మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ రాహుల్‌ ద్రవిడ్‌ సలహాలను భారత టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే గుర్తుచేసుకున్నాడు. ద్రవిడ్‌ సలహా తనకు ఎంతగానో ప్రేరణనిచ్చిందని తెలిపాడు. టీమిండియాకు ఎంపికవ్వడం గురించి అతిగా ఆలోచించొద్దని, దేశవాళీ క్రికెట్లో నిలకడగా పరుగులు చేస్తుంటే బోర్డు నుంచి పిలుపు దానంతటదే వస్తుందని చెప్పారని జింక్స్ చెప్పాడు. ప్రస్తుతం రహానే ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నాడు. జూన్ 18 నుంచి సౌథాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ ప్రారంభం కానుంది.

Dhoni-Parag: ఎంఎస్ ధోనీతో రియాన్‌ పరాగ్‌ని చూస్తే షాకే!!

ఏకాగ్రతతో ఆడితే పిలుపు అదే వస్తుంది:

ఏకాగ్రతతో ఆడితే పిలుపు అదే వస్తుంది:

భారత మాజీ వికెట్ కీపర్ డీప్ దాస్‌గుప్తాతో ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అజింక్య రహానే మాట్లాడాడు. 'నాకు దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ నాకింకా గుర్తుంది. 2008-09లో మేం సౌత్‌ జోన్‌పై ఆడుతున్నాం. చెన్నైలో జరిగిన ఆ మ్యాచులో రాహుల్‌ ద్రవిడ్‌ భాయ్ ఆడాడు. ఆ మ్యాచులో నేను 165, 98 పరుగులు చేశాను. మ్యాచ్‌ ముగిశాక రాహుల్‌ భాయ్‌ పిలిపించి నాతో మాట్లాడాడు. 'నేను నీ గురించి చాలా చదివాను. బాగా ఆడుతున్నావని తెలిసింది. భారత జట్టుకు ఎప్పుడు పిలుపొస్తుందా అని ఆటగాడిగా ఎదురుచూడటం సహజం. నీకు చెప్పేదొక్కటే. ఇప్పుడు చేస్తున్నట్టుగా పరుగులు చేయి. ఏకాగ్రతతో ఆడితే పిలుపు అదే వస్తుంది. జాతీయ జట్టుకు ఆడాలని టీమిండియా వెంట పరిగెత్తకు. అదే నిన్ను అనుసరిస్తుంది' అని నాతో చెప్పారు' అని జింక్స్ తెలిపాడు.

ఆ మాటలతో నేనెంతో స్ఫూర్తి పొందా:

ఆ మాటలతో నేనెంతో స్ఫూర్తి పొందా:

'రాహుల్‌ ద్రవిడ్‌ భాయ్‌ నుంచి అలాంటి సలహా రావడం నాకెంతో ప్రేరణ లభించినట్టుగా అనిపించింది. ఆ మాటలతో నేనెంతో స్ఫూర్తి పొందాను. ఆయన ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశారు. ఆ తర్వాత సీజన్లలోనూ నేను 1000+ పరుగులు చేశాను. రెండేళ్ల తర్వాత టీమిండియాకు ఎంపికయ్యాను' అని అజింక్య రహానే చెప్పాడు. 2007లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టిన జింక్స్ 2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రహానే భారత జట్టుకు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే.

అమ్రే మద్దతుగాతోనే:

అమ్రే మద్దతుగాతోనే:

'నా మొదటి రంజీ ట్రోఫీ సీజన్లో మొదటి 3-4 మ్యాచులు సరిగ్గా ఆడలేదు. దాంతో జట్టు నుంచి తప్పించి క్లబ్ క్రికెట్‌కు తిరిగి పంపించమని చాలా మంది అన్నారు. కానీ ఆ సమయంలో మా జట్టు కోచ్‌గా ఉన్న ప్రవీణ్ అమ్రే మద్దతుగా నిలిచారు. ఒకసారి మేము ఎవరినైనా జట్టులోకి తీసుకుంటే.. కనీసం 7-8 మ్యాచ్‌లు అతనికి అవకాశం ఇస్తామని చెప్పాడు. అప్పుడు ఉన్న ఏడు లీగ్ మ్యాచ్‌లలో మిగిలిన వాటిల్లో పరుగులు చేశాను. ఆ తర్వాతి ఐదు సీజన్లలో ప్రతిసారీ 1000కి పైగా పరుగులు చేశాను. మొదటి మూడు సంవత్సరాల తరువాత భారత జట్టు నుంచి పిలుపువస్తుందని ఊహించానని' అని జింక్స్ చెప్పుకొచ్చాడు.

 కోహ్లీ గైర్హాజరీలో నాయకత్వం:

కోహ్లీ గైర్హాజరీలో నాయకత్వం:

అజింక్య రహానే గతేడాది ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రెండో టెస్టుకు విరాట్ కోహ్లీ గైర్హాజరీలో జట్టుకు నాయకత్వం వహించాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో టీమిండియాకు అద్భుత విజయం అందించాడు. అనంతరం అతని నాయకత్వంలోనే మూడో టెస్టును డ్రా చేసుకున్న టీమిండియా.. చివరిదైన నాలుగో టెస్టును గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం జింక్స్ సన్నద్ధమవుతున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, June 11, 2021, 10:27 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X