వయసుతో పనిలేదు: రిటైర్మెంట్‌పై 42 ఏళ్ల మిస్బా
హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు తన వీడ్కోలుపై వస్తున్న వార్తలపై పాకిస్థాన్ టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్ స్పందించాడు. తన రిటైర్మెంట్‌పై ఎవరూ తొందపడాల్సిన అవసరం లేదని మిస్పా తేల్చి చెప్పాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలకాలా? లేదా అనే నిర్ణయం తన చేతుల్లో ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటే మంచిదని పేర్కొన్నాడు.
కెప్టెన్‌గా లేదా జట్టులో సభ్యుడిగా ఆడే విషయమై కూడా స్పష్టతనిచ్చాడు. అంతేకాదు వీడ్కోలు ప్రకటనను ముందుగా ప్రకటించి ఫేర్‌వెల్ పొందాలనేది తన అభిమతం కాదని కూడా స్పష్టం చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైర్మెంట్ ఆలోచనే లేదని మిస్బా చెప్పాడు.
42 ఏళ్ల మిస్బా మీడియాతో మాట్లాడుతూ 'ఇక్కడ వయసులో పనిలేదు. మన ఫిట్‌నెస్ పైనే జట్టులో ఉండటం అనేది జరుగుతుంది. సాధ్యమైనంత వరకూ నా జట్టుకు ఉపయోగపడటమే నా పని. ఆ విధంగానే ఆలోచిస్తున్నా. ఒక సీనియర్‌గా యువ ఆటగాళ్లకు ఏవిధంగా ఉపయోగపడాలనే ఆలోచనలో ఉన్నాను' అని మిస్బా తెలిపాడు.

ఇదే నా చివరి మ్యాచ్
'అంతేతప్ప ఇదే నా చివరి మ్యాచ్ అని ముందుగా ప్రకటించి సన్మానాలు అందుకోవడం లాంటి ప్రణాళికలు లేవు. నా రిటైర్మెంట్ అనేది నా చేతుల్లోనే ఉంది. పీసీబీకి ఎటువంటి సంబంధం లేదు' అని మిస్బా తెలిపాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు ముందు మిస్బా తప్పుకుంటాడనే వార్తలు వచ్చాయి.

పీసీబీ ఛైర్మన్ కోరిక మేరకు
అయితే పీసీబీ ఛైర్మన్ షహర్యాన్ ఖాన్ కెప్టెన్‌గా కొనసాగించాలని కోరడంతో ఆయన కోరిక మేరకు మిస్బా తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లలో మిస్బా కెప్టెన్‌గా కొనసాగుతూ వచ్చాడు.

రిటైర్మెంట్ వార్తలపై స్పష్టమైన ప్రకటన
తాజాగా తన రిటైర్మెంట్ వార్తలపై వస్తున్న ఊహాగానాలపై మిస్బా స్పష్టమైన ప్రకటన చేశాడు. 2010 నుంచి మిస్బా పాకిస్థాన్ టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్వవహారిస్తున్నాడు. ప్రస్తుత టెస్టు జట్టుకు అజహార్ అలీ వైస్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ, అతనిపై పీసీబీ నమ్మకం కుదరడం లేదు.

అజహార్ అలీ కెప్టెన్సీపై పీసీబీ అప నమ్మకం
అంతేకాదు అతనికి మరొక ప్రత్యామ్నంగా వేరొకరిని వేతికే పనిలో పీసీబీ ఉంది. మిస్బా నేతృత్వంలోని పాకిస్ధాన్ జట్టు ఈ ఏడాది నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయిత్ న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌ను 2-0తో కోల్పోవడంతో ప్రస్తుతం నాలుగో ర్యాంకులో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications