For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'Don't mess with Kohli': ‘అమర్‌ అక్బర్‌ ఆంథోని’ సినిమా డైలాగ్‌తో అమితాబ్ ప్రశంస!

Dont mess with Kohli: Big B recreates Amar Akbar Anthony lines to warn West Indies

హైదరాబాద్: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 6 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో అజేయంగా 94 పరుగులతో నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అయితే, మ్యాచ్ 16వ ఓవ‌ర్‌లో ఓ అరుదైన సంఘటనతో వార్తల్లో నిలిచాడు. 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు విజయానికి 30 బంతుల్లో 54 పరుగులు కావాలి. కోహ్లీ క్రీజులో ఉండటంతో మ్యాచ్ అప్పటికీ టీమిండియా చేతిలోనే ఉంది. విలియమ్స్‌ 16వ ఓవర్లో రెండో బంతిని అతని తలపై నుంచి కోహ్లీ నేరుగా బౌండరీకి తరలించాడు.

ఆ తర్వాతి బంతిని లాంగాన్‌లో కళ్లు చెదిరే సిక్సర్‌‌గా మలిచాడు. సిక్స‌ర్ కొట్టిన త‌ర్వాత కోహ్లీ అదే నోట్‌బుక్‌ స్ట‌యిల్‌లో ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాడు. జేబులో నుంచి నోట్‌బుక్‌ను తీసి మూడు సార్లు టిక్కులు కొడుతున్నట్లు సెలబ్రేషన్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో విరాట్ కోహ్లీని ఔట్‌ చేసినప్పుడు విలియమ్స్‌ జేబులోంచి బుక్‌ తీసినట్లు చూపిస్తూ టిక్కు కొట్టి కవ్వించాడు. దానిని దృష్టిలో ఉంచుకుని ఇలా చేసినట్లు మ్యాచ్‌ అనంతరం కోహ్లీ వెల్లడించాడు.

అయితే కోహ్లీ నోట్‌బుక్ సెలబ్రేషన్‌పై బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ స్పందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్‌లో "విరాట్‌ను కవ్వించొద్దని ఎన్నో సార్లు చెప్పాను. కానీ వారు నా మాట వినలేదు. దీంతో కోహ్లీ చిట్టి రాసి వారి చేతిలో పెట్టాడు. చూడండి ఇప్పుడు.. వెస్టిండీస్‌ ప్లేయర్ల ముఖాలు ఎలా మాడిపోయాయో" అని ట్వీట్ చేశాడు.

Story first published: Saturday, December 7, 2019, 12:56 [IST]
Other articles published on Dec 7, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+