నాకు క్రికెట్ అంటే ఇష్టం కాదు.. అదో పిచ్చి..: స్టార్ ఓపెనర్

సిడ్నీ: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పాటలు, డైలాగులకు టిక్‌టాక్ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రతీ ఏడాది ఈ సమాయానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడుతూ.. తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆసీస్ ఓపెనర్ భారత అభిమానులను అలరించేవాడు. కానీ ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 సీజన్ నిరవదికంగా వాయిదా పడింది. దీంతో వార్నర్ బ్యాట్ మూగబోయినా.. టిక్‌టాక్ వీడియోలతో అదే రీతిలో ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.

క్రికెట్ అంటే పిచ్చి ప్రేమ:
కరోనా వైరస్ సంక్షోభంలోనే టిక్‌టాక్ అరంగేట్రం చేసిన డేవిడ్ వార్నర్.. ఇప్పుడు అందులో పెద్ద స్టార్ అయిపోయాడు. మొన్నటి వరకూ తెలుగు,తమిళ, హిందీ పాటలకు స్టెప్పులేసిన వార్నర్.. ఇప్పుడు బ్యాట్ పట్టాడు. బ్యాట్‌తో తన ఫేవరెట్ షాట్లైన రివర్స్ స్వీప్, ఆన్ డ్రైవ్, స్విచ్ హిట్, స్లాగ్ షాట్‌లు ఆడి టిక్‌టాక్‌లోకి అప్‌లోడ్ చేశాడు. ఇలా ఆ షాట్లు ఆడమని అభిమానులకు చాలెంజ్ కూడా విసిరాడు. ఆ వీడియోకు ఒక ఆసక్తికరమైన కామెంట్‌ను పోస్ట్ చేశాడు. 'నాకు క్రికెట్ అంటే ఇష్టం కాదు. ఆ గేమ్ అంటే పిచ్చి ప్రేమ' అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన:
అంతకుముందు డేవిడ్ వార్నర్ పలు టిక్‌టాక్ వీడియోల్ని చేశాడు. ‘పోకిరి', ‘బాహుబలి' చిత్రాల్లోని డైలాగులు చెబుతూ.. ‘అలవైకుంఠపురములో'లోని పాటలకు చిందులేస్తూ వీడియోలు షేర్ చేసాడు. ఆ వీడియోలకు అటు ఆయన అభిమానులు, ఇటు తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. టిక్‌టాక్ చేయడానికి అనర్హం కానిది ఏదీ లేదన్నట్లు అన్నీ చేసేస్తున్నాడు వార్నర్.

ప్రభుదేవా పాటకు వార్నర్ డ్యాన్స్:
తాజాగా ప్రభుదేవా పాటకు తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన చిత్రం ‘ప్రేమికుడు'. ఇందులోని ‘ముక్కాబులా' పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇటీవల దీన్ని రీమిక్స్ కూడా చేశారు. ఇప్పుడు ఆ పాటకు డేవిడ్ వార్నర్ తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. అంతేకాదు, ‘ఎవరు బాగా చేశారు' అని ఇన్‌స్టా వేదికగా ప్రశ్నించాడు.
'మైండ్‌బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయలేను:
అలవైకుంఠపురం చిత్రంలోని రెండు సాంగ్స్‌కు వార్నర్ టిక్ చేయడంతో.. సూపర్‌స్టార్ మహేశ్ బాబు సూపర్ హిట్ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'లోని 'మైండ్‌బ్లాక్' పాటకు డ్యాన్స్ చేయాలని అభిమానులు వార్నర్‌ను కోరారు. చాలా మంది ఈ విషయమై అతనికి ట్వీట్ చేశారు. అయితే ఈ పాటకి తాను డ్యాన్స్ చేయలేకపోతున్నానని వార్నర్ తాజాగా తెలిపాడు. అందుకు కారణం కూడా చెప్పాడు.'ఈ పాటకి నేను డ్యాన్స్ చేయలేను. ఎందుకంటే అది ఆస్ట్రేలియాలో యాప్‌లో అందుబాటులో లేదు. ఒకసారి అందుబాటులోకి వస్తే.. నేను మైండ్‌బ్లాక్ పాటకు టిక్ టాక్ చేస్తాను'' అంటూ వార్నర్ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications