హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రెండో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన సెంచూరియన్‌లోని సూపర్ స్పోర్ట్ పార్కు మైదానంపై భారత పేసర్ మొహమ్మద్ షమి అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ గడ్డపై ఇలాంటి పిచ్‌ను ఇప్పటి వరకూ తాను చూడలేదని షమీ అన్నాడు.
రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం షమీ మాట్లాడుతూ 'నేను ఊహించినంత ఎత్తులో బంతి వికెట్ల మీదకు వెళ్లడం లేదు. ఇప్పటి వరకు విదేశీ గడ్డలపై ఇలా నెమ్మదిగా, బంతి బౌన్స్ అవ్వని పిచ్‌ను నేను ఎన్నడూ చూడలేదు. ఏది ఏమైనా ఇరు జట్లు ఒకేలాంటి పరిస్థితులపై ఆడుతున్నాయి' అని షమీ అన్నాడు.
'ఆట ప్రారంభమైన తొలి రోజు నుంచి బంతి బౌన్స్ కావడం లేదు. నాలుగో రోజు నాటికి పరిస్థితి మారలేదు. దీంతో బౌలర్లు ఎక్కువగా శ్రమించి బంతులు వేయాల్సి వస్తోంది. బుధవారం చివరి రోజు ఆటలో గెలిచేందుకు చివరి వరకు పోరాడుతాం' అని షమీ చెప్పుకొచ్చాడు.
తొలి సెషన్‌లో మూడు వికెట్లు తీసినప్పటికీ.. లంచ్ విరామం ముందు వరకు బౌలింగ్ వేసే అవకాశం ఇవ్వకపోవడంపై మీడియా షమీని ప్రశ్నించగా 'ఇది పూర్తిగా కెప్టెన్ నిర్ణయం. పరిస్థితులకు అనుగుణంగా ఎవరితో బౌలింగ్ వేయించాలనుకుంటే వారితో వేయిస్తాడు. నేను ఎప్పుడు బౌలింగ్ చేయడానికైనా సిద్ధంగానే ఉంటా' అని అన్నాడు.
సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసిన షమీ, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. అంతేకాదు ఈ టెస్టులో అత్యంత వేగవంతంగా వంద వికెట్లు సాధించిన మూడో భారత్ పేసర్‌గా గుర్తింపు సాధించాడు. సెంచూరియన్ టెస్టులో రెండో రోజు ప్రారంభంలోనే కేశవ్ మహారాజ్‌ను పెవిలియన్ చేర్చడం ద్వారా షమీ ఈ ఘనత సాధించాడు.
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో కేశవ్ మహరాజ్‌ను ఔట్ చేయడం ద్వారా షమీ తన ఖాతాలో వందో వికెట్‌ను వేసుకున్నాడు. ప్రస్తుతం తన కెరీర్లో 29వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న షమీ ఈ జాబితాలో మూడో స్ధానంలో నిలిచాడు. షమీకి ముందు కపిల్ దేవ్(25 టెస్టులు), ఇర్ఫాన్ పఠాన్(28 టెస్టులు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.