
యో-యో పరీక్షేంటో నాకు తెలీదు
'యో-యో పరీక్షేంటో నాకు తెలీదు. యువీ మాత్రం కచ్చితంగా ఇండియన్ టీమ్‌లోకి రావాల్సిందే' అని అజహరుద్దీన్ అన్నాడు. ఫిట్‌నెస్ విషయానికి వస్తే మాత్రం అందరూ ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌గా లేకపోతే ఆడటం కష్టమే. కొందరు ప్లేయర్స్ తమ కెరీర్ చివరి దశలో ఉన్నా ఇంకా చాలా బాగానే ఆడుతున్నారు' అజహరుద్దీన్ అన్నాడు.

క్యాన్సర్ కారణంగా యువీ కాస్త వెనకబడ్డాడు
'వాళ్ల కోసం ఫిట్‌నెస్ ప్రమాణాలను కాస్త తగ్గిస్తే బాగుంటుంది. యువీ అనారోగ్యం (క్యాన్సర్) కారణంగా కాస్త వెనకబడ్డాడు. 2011 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత యువరాజ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడో అర్థం చేసుకొని, అతని కోసం ఈ ఫిట్‌నెస్ నిబంధనలను కాస్త సడలించాలి' అని అజారుద్దీన్ అన్నాడు.

వ్యక్తిగతంగా రైనాకు అభిమానిని
ఈ సందర్భంలో సురేశ్ రైనా ప్రస్తావన కూడా వచ్చింది. 'యువీ యొ-యొ టెస్ట్ పాస్ అవడం కష్టమే. ఇంకా కొందరు ప్లేయర్స్ కూడా ఉన్నారు. నేను వ్యక్తిగతంగా రైనాకు అభిమానిని. అతను కూడా టీమ్‌లోకి తిరిగి రావాలి. నెల క్రితం రైనాను కలిశాను. చాలా ఫిట్‌గా ఉన్నాడు. అయితే జట్టు తీసుకున్న నిర్ణయాన్ని మనం గౌరవించాలి' అని అజారుద్దీన్ అన్నాడు.

యో-యో టెస్టులో పాస్ అవ్వకపోవడం వల్లే
ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత యువీ తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. దీనిపై సెలక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నిస్తే యువీకి విశ్రాంతినిచ్చామని తెలిపారు. అయితే యో-యో టెస్టులో పాస్ అవ్వకపోవడం వల్లే యువరాజ్‌ని ఎంపిక చేయలేదని ఆ తర్వాత మీడియాలో వార్తలు వచ్చాయి.

కేబీసీ షోలో రూ. 25 లక్షలు గెలుచుకున్న యువరాజ్
శ్రీలంకతో డిసెంబరులో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌కి ఎంపికయ్యేందుకు గాను యో-యో టెస్టులో పాసవ్వడం కోసం ప్రస్తుతం యువీ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కౌన్‌బనేగా కరోడ్‌పతి (కేబీసీ) షోలో యువరాజ్ సింగ్ రూ. 25 లక్షలను గెలుచుకున్నాడు.

యో-యో' పరీక్ష అవసరం లేదన్న రాహుల్ ద్రవిడ్
ఇదిలా ఉంటే అండర్-19 క్రికెటర్లకు 'యో-యో' పరీక్ష అవసరం లేదని జూనియర్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నాడు. 'అండర్-19 జట్టుకు యోయో పరీక్ష నిర్వహించాలని టీమిండియా ట్రైనర్ ప్రతిపాదించారు. అయితే జూనియర్ క్రికెట్‌కు ఇది అవసరం లేదని ద్రవిడ్ అన్నారు. ఈ వయసులో ఆటగాళ్లు తమ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి. ఫిట్‌నెస్ కీలకమే కానీ పరుగులు చేయడం, వికెట్లు తీయడమే ఆటగాడి ఎంపికకు ప్రాతిపదిక' అని ఎన్‌సీఏ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











