Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరుసగా ఏడు పరాజయాలు ఏం జరుగుతుందొ తెలియడం లేదు: యువరాజ్

Yuvraj Singh
ఐపిఎల్ 4లోకి కొత్తగా అడుగుపెట్టింది పూణె వారియర్స్ ఇండియా. అడుగు పెట్టి పెట్టగానే వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వరుసగా ఏడు పరాజయాలను మూటకట్టుకుంది. ఐపిఎల్ 4లో పూణె వారియర్స్ ఆడినటువంటి తొమ్మిది మ్యాచ్‌లలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి మిగిలిన ఏడు మ్యాచ్‌లను వరుసగా ఓడిపోవడం జరిగింది. నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగినటువంటి మ్యాచ్ తర్వాత పూణె వారియర్స్ కెప్టెన్ యువరాజ్ సింగ్ తన మనసులోని భావాలను వెల్లడించారు.

ఈ సందర్బంలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ వరుసగా ఏడు మ్యాచ్‌లు ఓడిపోవడానికి కారణం ఏమైఉంటుంది అని అడగగా... యువరాజ్ సింగ్ దీనిలో చెప్పడానికి ఏమీ లేదంటూ దాటవేశాడు. అసలు ఇందులో ఎటువంటి క్లూ లేదని అన్నాడు. వరుసగా ఏడు మ్యాచ్‌లలో ఓడిపోవడం వల్ల పూణె వారియర్స్ ప్లే-ఆప్స్ లో ఆడే అవకాశాన్ని కూడా కోల్పోయింది. ముంబై ఇండియన్స్‌తో జరిగినటువంటి మ్యాచ్‌లో పూణె వారియర్స్ 21పరుగుల తేడాతో ఓడిపోయారు. దీంతో పాయింట్ల పట్టికలో చివరి భాగానికి చేరారు.

ఈ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఆనందపడడానికి ఒకే ఒక్క కారణం ఉంది. ఆ కారణం ఏమిటంటే ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌ని అవుట్ చేయడమే. అంతేకాకుండా పూణె వారియర్స్ లెగ్ స్పిన్నర్ రాహుల్ శర్మకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. చివరగా నాకు తెలిసి మాటీమ్ ఎక్కువ డాట్ బాల్స్ ఆడడం జరిగింది. అంతేకాకుండా గేమ్ చివరలో పవర్ హిట్టర్స్ చాలా అవసరం అని యువరాజ్ సింగ్ అన్నారు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 160/7 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన పుణ 20 ఓవర్లలో కేవలం 139/7 పరుగులు మాత్రమే చేసి మరో ఓటమిని చవి చూసింది. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై ఇండియన్స్‌ తొలి వికెట్‌ త్వరగానే కోల్పోయినా కెప్టెన్‌ సచిన్‌ టెండూల్కర్‌ (24), రాయుడు (27) పరుగులు చేసి ఆదుకున్నారు. తర్వాత వచ్చిన రోహిత్‌ శర్మ (12) పొదుపుగా ఆడాడు. ఈ దశలో ముంబై 92 బంతుల్లో 100 పరుగులను పూర్తి చేసుకుంది. వీరి తర్వాత వచ్చిన సుమన్‌ చెలరేగిపోయాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన సుమన్‌ కేవలం 16 బంతుల్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో 36 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. చివర్లో పొలార్డ్‌ కూడా విజృంభించాడు. ధాటిగా ఆడిన పొలార్డ్‌ 21 బంతుల్లో 30 పరుగులు చేశాడు. మరోవైపు హర్భజన్‌ ఇతనికి అండగా నిలిచి కేవలం 3 బంతుల్లోనే 8 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+