ఐపీఎల్ ఫామ్ ఆధారంగా కోహ్లీని అంచనా వేయొద్దు: వెంగ్ సర్కార్


కేవలం ఐపీఎల్ ఫామ్ ఆధారంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అంచనా వేయొద్దు.. అతని సామర్ధ్యాన్ని నిందించడం సరికాదని భారత జట్టు మాజీ కెప్టెన్, మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్‌సర్కార్ అంటున్నారు. ఐపీఎల్ 2019 సీజన్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు అత్యంత దారుణంగా ప్రారంభించింది. వరుసగా 6 మ్యాచుల్లో ఓడిపోవడంతో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది.
ఐపీఎల్ ప్రభావం రానున్న వరల్డ్ కప్ సీజన్‌పై పడితే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని కొందరు హెచ్చరిస్తున్నారు. ఇక అభిమానులు అయితే ఏకంగా కోహ్లీని ప్రపంచకప్ సారధ్య బాధ్యతల నుండి తప్పించి.. రోహిత్ శర్మకు అప్పగించాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీకి దిలీప్ వెంగ్‌సర్కార్ అండగా నిలిచారు.

ప్రపంచ గొప్ప ఆటగాళ్లలో ఒకడు:
తాజాగా వెంగ్‌సర్కార్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ ప్రదర్శన పరిగణలోకి తీసుకుని ఎవరిని నిందించడం సరికాదు. కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. అతను ప్రపంచ గొప్ప ఆటగాళ్లలో ఒకడు. కెప్టెన్‌గా కూడా అద్భుతంగా రాణించాడు. ఇప్పటికే వన్డే, టెస్టులలో నిరూపించుకున్నాడు. అతని మీద నమ్మకం ఉంది, 100 శాతం సక్సెస్ అవుతాడు' అని వెంగ్‌సర్కార్ అన్నారు.

కచ్చితంగా కప్ గెలుస్తుంది:
టీమిండియాకు మంచి బౌలింగ్ ఉంది. ఇప్పటివరకు భారత్ తరపున ప్రపంచకప్ ఆడిన జట్లలో ఇదే అత్యుత్తమం. గతంలో చివరి 10 ఓవర్లలో టీమిండియా తేలిపోయేది. ఇప్పుడు మాత్రం బాగా రాణిస్తోంది. భువి, బుమ్రాలు చివరి 10 ఓవర్లు బాగా వేస్తున్నారు. భారత్ కచ్చితంగా కప్ గెలుస్తుంది' అని వెంగ్‌సర్కార్ ఆశాభావం వ్యక్తం చేశారు.

నాలుగో స్థానంపై ఏమన్నారంటే:
'కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. రోహిత్ కూడా రాణిస్తున్నాడు. అయితే ఈ ఇద్దరిపై మాత్రం ఆధారపడకూడదు. ఇతర ఆటగాళ్లు కూడా పరుగులు చేయాలి. ఇద్దరు త్వరగా అవుట్ అయితే మిగతా వారి మీద ఒత్తిడి పడే అవకాశం ఉంది. నాలుగో స్థానంలో చాలామంది పోటీలో ఉన్నా.. కేఎల్ రాహుల్, అంజిక్య రహానేలకు అవకాశం ఇవ్వాలి. మయాంక్ అగర్వాల్ కూడా ఆసీస్ సిరీస్ లో రాణించాడు. అతన్ని పరిగణలోకి తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది' అని వెంగ్‌సర్కార్ చెప్పుకొచ్చారు.

తొలి మ్యాచ్ దక్షిణాఫ్రికాతో:
మే 30నుంచి ఇంగ్లండ్‌లో మెగా టోర్నీ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. మే 30న ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. జూన్ 5న భారత్ తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. రౌండ్ రాబిన్ విధానంలో జరిగే 2019 ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications