న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా నుంచి అద్భుతాలు ఆశించొద్దు: లార్డ్స్‌లో టెస్టు అరంగేట్రంపై జోఫ్రా ఆర్చర్

Dont expect any miracles, says Archer ahead of Ashes debut


హైదరాబాద్:
లార్డ్స్‌ వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో యాషెస్ టెస్టులో తాను టెస్టు అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ చెప్పాడు. అయితే, తొలి టెస్టులోనే తన నుంచి అద్భుతాలు ఆశించొద్దని ఈ సందర్భంగా తెలిపాడు.

రెండున్నర కిలోమీటర్లు వరదల్లో ఈదాడు.. బాక్సింగ్‌లో పతకం గెలిచాడు

ప్రపంచకప్ ముగిసిన తర్వాత ఐదు టెస్టుల యాషెస్ టెస్టు సిరిస్‌లో చోటు దక్కించుకున్నప్పటికీ గాయం కారణంగా జోఫ్రా ఆర్చర్ ఎడ్జిబాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు గాయం తిరగబెట్టడంతో రెండో టెస్టుకు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ టెస్టు అరంగేట్రానికి మార్గం సుగమం అయింది. ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ "నాకు ఏ ఫార్మాట్‌ క్రికెట్‌ అయినా ఒకటేనని, ఈ ఫార్మాట్‌లోనే ఆడతాననే నిబంధనలు ఏమీ లేవు" అని చెప్పుకొచ్చాడు.

లార్డ్స్‌ వేదికగా రెండో టెస్టు

లార్డ్స్‌ వేదికగా రెండో టెస్టు

ఇక, లార్డ్స్‌ వేదికగా జరుగనున్న రెండో టెస్టులో కూడా ఇంగ్లాండ్‌ బౌలర్లను ఓ ఆట ఆడుకుంటామని, జోఫ్రా ఆర్చర్‌ వచ్చినా తాము ధీటుగానే బదులిస్తామని ఆస్ట్రేలియా హెడ్ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మీడియా సమావేశంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.

లాంగర్ వ్యాఖ్యలపై జోఫ్రా ఆర్చర్

లాంగర్ వ్యాఖ్యలపై జోఫ్రా ఆర్చర్

లాంగర్ వ్యాఖ్యలను తాను తాను పెద్దగా పట్టించుకోనని ఆర్చర్ తెలిపాడు. తన టెస్టు అరంగేట్రంపై ఆర్చర్‌ మాట్లాడుతూ "నేను వైట్‌బాల్‌ క్రికెట్‌ కంటే కూడా రెడ్‌బాల్‌ క్రికెట్‌ ఎక్కువ ఆడా. దాంతో టెస్టు ఫార్మాట్‌ భయం లేదు. నేను రెడ్‌బాల్‌ ఎక్కువ ఆడాననే విషయం అభిమానులకు తెలియకపోవచ్చు" అని అన్నాడు.

నేను ఆడింది రెడ్‌బాల్‌ క్రికెటే

నేను ఆడింది రెడ్‌బాల్‌ క్రికెటే

"నేను ససెక్స్‌తో క్రికెట్‌ను ఆరంభించినప్పుడు ఆడింది రెడ్‌బాల్‌ క్రికెటే. మానసికంగా బలంగా లేనప్పుడు అసలు మనం ఎవరనే ప్రశ్న తలెత్తుంది. నేను టెస్టు ఫార్మాట్‌లో ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నా" అని ఆర్చర్ చెప్పుకొచ్చాడు. గత వారం సెకండ్‌ ఎలెవన్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా ససెక్స్‌ సౌత్‌ తరఫున ఆడిన ఆర్చర్‌ ఆకట్టుకున్నాడు.

ఆరు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ

ఆరు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ

తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ సాధించిన తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే, యాషెస్‌ సిరీస్‌ రెండో టెస్టులో ఆర్చర్‌కు తుది జట్టులో చోటు కల్పించినా ఎన్ని ఓవర్లు నిలకడగా బౌలింగ్‌ చేయగలడు అనేది ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ను ఆలోచనలో పడేసింది. దీంతో ఆర్చర్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి మరి.

Story first published: Tuesday, August 13, 2019, 12:00 [IST]
Other articles published on Aug 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X