ఏకైక టీ20: ఓటమికి కెప్టెన్ కోహ్లీ చెప్పిన కారణం ఇదీ
హైదరాబాద్: వెస్టిండిస్‌తో ఆదివారం జరిగిన ఏకైక టీ20లో ఓటమి పాలవడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌లో రాణించినా బౌలింగ్, ఫీల్డింగ్‌లో వైఫల్యం చెందడం వల్లే ఓటమి పాలయ్యామని మ్యాచ్ అనంతరం కోహ్లీ చెప్పాడు.
ఆదివారం కింగ్ స్టన్ వేదిగా జరిగిన ఏకైక టీ20 మ్యాచ్‌లో కోహ్లీసేనపై వెస్టిండిస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ చేతిలో ఎదురైన వన్డే సిరీస్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. భారత్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని విండీస్ మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించింది.
విండీస్ ఓపెనర్ ఎవిన్ లూయిస్ (62 బంతుల్లో 125 నాటౌట్; 6 ఫోర్లు, 12 సిక్సులతో) మెరుపు సెంచరీతో రాణించగా మార్లోన్ శామ్యూల్స్ (36), క్రిస్ గేల్ (18) అతనికి చక్కటి సహకారం అందించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు.

230 పరుగులు చేస్తామని అనుకున్నాం
‘బ్యాటింగ్‌లో మేము అదనంగా 25 నుంచి 30 పరుగులు సాధించాల్సింది. 230 పరుగులు చేస్తామని అనుకున్నాం. కానీ విండీస్ ఆటగాళ్లు బాగా ఫీల్డింగ్ చేశారు. మేము కొన్ని అవకాశాలు చేజార్చుకున్నాం' అని కోహ్లీ పేర్కొన్నాడు. భారత ఆటగాళ్లలో దినేశ్ కార్తీక్ అద్భుత ప్రదర్శన చేశాడని, అయితే టీ20 క్రికెట్‌లో రాణించాలంటే ఇంకా 80-90 పరుగులు కావాల్సి ఉందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్ జరిగే సమయంలో వచ్చిన అవకాశాలను వదులుకుంటే విజయం సాధించే అర్హత లేనట్టేనని కోహ్లీ అన్నాడు.

పరిస్థితులను బట్టి ఎలా స్పందించాలో
పరిస్థితులను బట్టి ఎలా స్పందించాలో ఈ మ్యాచ్ ద్వారా తన సహచర క్రికెటర్లకు అర్థమయిందనే ఆశాభావాన్ని కోహ్లీ వ్యక్తం చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన వెస్టిండిస్ జట్టుపై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో విండీస్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరిచారని కోహ్లీ కొనియాడాడు.

టీ20 క్రికెట్‌లో వెస్టిండిస్ సత్తా ఏమిటో
టీ20 క్రికెట్‌లో వెస్టిండిస్ జట్టు ప్రమాదకరమైందని మరోసారి రుజువైందని కోహ్లీ తెలిపాడు. గత కొన్నేళ్లుగా విండిస్ జట్టు టీ20 క్రికెట్‌లో రాణించడాన్ని కోహ్లీ మెచ్చుకున్నాడు. మొత్తం మీద వెస్టిండీస్ పర్యటనను బాగా ఎంజాయ్ చేశామని చెప్పాడు. ఆదివారం విండీస్‌తో జరిగిన ఏకైక టి20లో 9 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

సెంచరీతో విండిస్‌ను గెలిపించిన ఓపెనర్ లూయిస్
విండిస్ ఓపెనర్ లూయిస్ అజేయ సెంచరీ(125)తో విండీస్‌ను గెలిపించాడు. లూయిస్ వ్యక్తిగత స్కోరు 46, 55 వద్ద అతడు ఇచ్చిన క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేశారు. లూయస్‌కి ఇది భారత్‌పై వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. గతేడాది అమెరికాలోని ఫ్లోరిడాలో టీమిండియాతో జరిగిన గత టీ20 మ్యాచ్‌లో కూడా లూయిస్ 48 బంతుల్లోనే సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications