కోహ్లీ ఆ బౌలర్లను ఫేస్ చెయ్యలేదు.. సచిన్ తో ఎలా పోలుస్తారు?

ప్రపంచ క్రికెట్ లెజెండ్స్‌లో సచిన్ టెండూల్కర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దేశంతో సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడీ స్టార్ క్రికెటర్. అదే అడుగు జాడల్లో నడుస్తున్న విరాట్ కోహ్లీ కూడా దేశంతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నాడు. అంతేకాదు సచిన్ తన కెరీర్‌లో చేరుకున్న ఎన్నో మైలురాళ్లను ఒకటొకటిగా బద్దలు కొడుతూ వస్తున్నాడీ ఢిల్లీ కుర్రాడు. ఈ క్రమంలో కోహ్లీని చాలా మంది సచిన్‌తో పోలుస్తున్నారు.
కోహ్లీ కూడా తక్కువేం కాదు. మోడ్రన్ క్రికెట్ లెజెండ్. అసామాన్యమైన పట్టుదల, అద్భుతమైన ఆటతీరుతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించాడు. కోహ్లీ ఆడిన కొన్ని ఇన్నింగ్సులు చూస్తే.. ఇలాంటి ఆటగాడు తరానికి ఒక్కడే ఉంటాడని అనిపిస్తుంది. ఈ కారణంగానే కోహ్లీ, సచిన్ ఇద్దర్నీ పోలుస్తూ.. ఇద్దరిలో ఎవరు గొప్ప? అని కొందరు ప్రశ్నిస్తుంటారు. అయితే వీళ్లిద్దరినీ పోల్చడం మాత్రం కరెక్ట్ కాదని పాకిస్తామ్ మాజీ లెజెండ్ సక్లయిన్ ముస్తాక్ అంటున్నాడు. కోహ్లీ గొప్ప ఆటగాడే కానీ, సచిన్ స్థాయి అతనికి లేదని అంటున్నాడు.

"సచిన్ టెండూల్కర్ కన్నా పెద్ద క్రికెటర్ లేడు. ఈ విషయాన్ని నేను కాదు, మొత్తం ప్రపంచం ఒప్పుకుంటుంది. ఏ షాట్ ఎలా ఆడాలి? అని చెప్పాలంటే.. చాలామంది సచిన్ ఆటనే చూపిస్తారు. ప్రస్తుత క్రికెట్లో విరాట్ కోహ్లీ లెజెండ్. నేను కాదని చెప్పను. కానీ సచిన్ ఎదుర్కొన్న బౌలర్లను కోహ్లీ ఫేస్ చెయ్యలేదు. ఆ కాలం బౌలర్లు వేరు. వసీం అక్రం బౌలింగ్ లో కోహ్లీ ఆడాడా? వాల్ష్, ఆంబ్రోస్, మెక్ గ్రాత్, షేన్ వార్న్, మురళీధరన్ వాళ్ళు చాలా తెలివైన బౌలర్లు. వాళ్ళు బ్యాటర్లను ట్రాప్ చేస్తారు. ఇప్పటి బౌలర్లు రెండు రకాలుగా ఉన్నారు. ఒక రకం నిన్ను పరుగులు చెయ్యకుండా ఆపితే.. మరోరకం బౌలర్లు ట్రాప్ చేస్తారు. కానీ అప్పటి వాళ్లకు ఈ రెండూ తెలుసు. బ్యాటర్లను ట్రాప్ చేయడంలో వాళ్ళు దిట్టలు" అని సక్లయిన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications