For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెహ్వాగ్ లాంటి జీనియస్‌తో పృథ్వీని పోల్చొద్దు: గంగూలీ

India vs West Indies 2018 : Prithvi Shaw Will Not be Comepared With Sehwag Says Ganguly | Oneindia
Dont Compare Prithvi Shaw To Genius Virender Sehwag: Sourav Ganguly

హైదరాబాద్: భారత్-వెస్టిండీస్ టెస్టు సిరీస్‌‌లో అరంగ్రేటం చేసిన పృథ్వీ షా తొలి టెస్టులోనే సెంచరీ బాదేశాడు. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఆరంభమైన ద్వైపాక్షిక సిరీస్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 364 పరుగులు చేసింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన పృథ్వీ కేవలం 99బంతుల్లోనే సెంచరీ చేసేశాడు. వన్డే తరహాలో బౌలర్లపై విరుచుకుపడ్డ షా పై అదే తరహాలో ప్రశంసలు అందుతున్నాయి.

సెహ్వాగ్ లాంటి జీనియస్ ఆటగాడితో పోల్చడం

సెహ్వాగ్ లాంటి జీనియస్ ఆటగాడితో పోల్చడం

వాటితో పాటు గంగూలీ లాంటి వాళ్ల సూచనలు యువ క్రికెటర్‌ను ఉద్దేశించి చెప్తున్నారు. షా అరంగ్రేటం మ్యాచ్‌లో సెంచరీ చేసిన తీరు అద్భుతం. అతను బౌలర్లను ఎదుర్కొనే శైలి బాగుంది. కానీ, అతణ్ని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ లాంటి జీనియస్ ఆటగాడితో పోల్చడం సరికాదు. పృథ్వీ షా అతని దులీప్ ట్రోఫీ.. రంజీ ట్రోఫీల అరంగ్రేటంలోనూ సెంచరీ చేశాడు.

పృథ్వీ.. అతని ప్రదర్శన శైలిని చూసి

పృథ్వీ.. అతని ప్రదర్శన శైలిని చూసి

ఇప్పుడు టీమిండియా అరంగ్రేట మ్యాచ్‌లోనూ అలాగే బాదేశాడు. ఇది కేవలం అతని శైలి కూడా అనుకోవచ్చు. ఈ సిరీస్ తర్వాత టీమిండియా ఆడనున్న ఆస్ట్రేలియా పర్యటనలో పృథ్వీ రాణిస్తాడని నమ్మకముంది. షా టెంపర్‌మెంట్ అతని ప్రదర్శన శైలిని చూసిన గంగూలీ.. టీమిండియాలో ఎక్కువ కాలం కొనసాగుతాడనే విశ్వాసాన్ని వ్యక్త పరిచాడు. 'అతని పాజిటివ్ కోణం, బ్యాటింగ్ చేసే శైలి అమోఘం.

ఆస్ట్రేలియా పర్యటనలో పృథ్వీ రాణిస్తాడని

ఆస్ట్రేలియా పర్యటనలో పృథ్వీ రాణిస్తాడని

అండర్ 19 వరల్డ్ కప్.. టెస్టు మ్యాచ్ ఫార్మాట్‌లు వేర్వేరు. కానీ షా దానికి ధీటుగా రాణించి సత్తా చాటాడు. మరి కొద్ది రోజుల్లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన చేయనుంది. ఆ పర్యటనలో పృథ్వీకి చోటు లభిస్తుంది. ' టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ పూర్తి

ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ పూర్తి

18ఏళ్ల 329రోజులకు షా .. చిన్న వయస్సులోనే సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరిపోయాడు. గంగూలీ కూడా 1996వ సంవత్సరంలో తన అరంగ్రేట మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేశాడు. కానీ, రంజీ ట్రోఫీలో సెంచరీ చేయలేదు. దులీప్ ట్రోఫీ అరంగ్రేటంలో మాత్రం సెంచరీ బాదేశాడు.

Story first published: Friday, October 5, 2018, 11:21 [IST]
Other articles published on Oct 5, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+