Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీతో పోల్చొద్దు.. నేను నా లానే ఉంటా: కోహ్లీ

న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో తనను పోల్చొద్దని యువ క్రికెటర్, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. తనది భిన్నమైన వ్యక్తిత్వమని చెప్పుకొచ్చాడు. ప్రపంచ కప్ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో ధోనీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాక, భారత జట్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్‌గా తొలి పర్యటనకు సిద్ధమయ్యాడు.

బంగ్లాదేశ్ పర్యటనలో భారత టెస్టు జట్టుకు విరాట్ సారథ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా కోహ్లీ ఈఎస్‌పిఎన్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు, ధోనీకి మధ్య చాలా వ్యత్యాసాలున్నాయని చెప్పాడు.

'ధోనీకి, నాకు మధ్య ఎందుకు పోలిక తెస్తారు? నాది విభిన్నమైన మనస్తత్వం' అని ఓ ప్రశ్నకు సమాధానంగా కోహ్లీ చెప్పాడు. కాగా, కెప్టెన్‌గా ధోనీ నుంచి చాలా విషయాలు నెర్చుకున్నానని చెప్పాడు. కాగా, ధోనీ మిస్టర్ కూల్‌గా ప్రశంసలు అందుకోగా, కోహ్లీ దూకుడైన మనస్తత్వంతో కొన్నిసార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు.

Don't compare me with Dhoni, I'm different: Virat Kohli

కోహ్లీ ఈ విషయంపై స్పందిస్తూ.. తన స్వభావాన్ని మార్చుకోనని చెప్పాడు. టెస్టు క్రికెట్లో భారత కెప్టెన్‌గా ధోనీ ఎన్నో ఘనవిజయాలు సాధించాడని, వాటి కంటే అత్యుత్తమ ఫలితాలు సాధించడం చాలా కష్టమని కోహ్లీ అంగీకరించాడు.

ధోనీ హయంలో దిగ్గజ ఆటగాళ్లయిన సీనియర్లు జట్టులో ఉండేవారని, ప్రస్తుతం యువ ఆటగాళ్ల మధ్య సమన్వయం సాధించాల్సిన అవసరముందని చెప్పాడు. ధోనీ కూడా ఎప్పుడూ యువ ఆటగాళ్లపై అధికారాన్ని చూపలేదని తెలిపాడు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+