న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాన్న నాకిచ్చిందే.. నా కొడుక్కి నేనిస్తా..: సచిన్ టెండూల్కర్

Don't compare Arjun with me: Sachin Tendulkar

హైదరాబాద్: నాన్న నాకిచ్చిందే నా కొడుక్కీ ఇస్తానంటూ తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు సచిన్ టెండూల్కర్. ఈ మధ్యనే యువ క్రికెటర్లు మంచి ఫామ్ తో దూసుకొస్తున్న తరుణంలో సచిన్ తన కొడుకును ఒత్తిడి పెట్టదలచుకోవట్లేదంటూ పేర్కొన్నాడు. తన తండ్రి రమేశ్ టెండూల్కర్ నుంచి తను ఏ విధంగానైతే ఫ్రీడం పొందాడో అదే తన కొడుక్కి ఇస్తా అని తెలిపాడు.

ఇటీవలే ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్ అర్జున్ 24 బంతులకు నాలుగు వికెట్లు తీసి 48 పరుగులు ఇచ్చాడు.
గతేడాది డిసెంబరులో జరిగిన కోచ్ బెహార్ అండర్ 19 ట్రోఫీలో ఐదు వికెట్లు తీసి కేవలం 44 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో ప్రత్యర్థి జట్టు రైల్వేస్ 103పరుగులు తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది.

అర్జున్ ఆడుతున్న తీరుకు సచిన్ టెండూల్కర్ ప్రతిభను పోలుస్తూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సచిన్ ఇలా స్పందించాడు. 'అతను ఎప్పటికీ అర్జున్ అంతే.. ఎటువంటి పోలికలు వద్దు. నాకు ఎలా అయితే నా తండ్రి ఫ్రీడం ఇచ్చారో.. నేను నా కొడుక్కి అలానే ఫ్రీడం ఇస్తాను. నా అంత అవ్వాలని.. ఇలానే చేయాలని తనకు నేనెప్పుడూ చెప్పను.' అని సచిన్ తన కొడుకు ఎదుగుదల గురించి మాట్లాడాడు.

'మీడియా నుంచి, దగ్గర వాళ్ల నుంచి విమర్శలు వస్తూనే ఉంటాయి. నేను ఓ తండ్రిగా కోరుకునేది ఒక్కటే అర్జున్ తన ఆట మీదే దృష్టి పెట్టాలి. వీటన్నిటిపైనా కాదు. మా నాన్న అదే చెప్పే వారు. నువ్వేం చేయాలనుకుంటున్నావో.. కేవలం దాని మీదే ధ్యాస పెట్టు అని. మిగతావి అవే సర్దుకుపోతాయి.' అని తన ముద్దుల క్రికెటర్ కొడుకుకి సచిన్ సూచనలిస్తున్నాడు. తాను ఈ స్థాయికి రావడానికి చాలా కాలం పట్టిందని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అతని కొడుకుని తనతో పోల్చడం సరికాదనే వ్యంగ్యాస్త్రం విసిరాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, February 8, 2018, 19:22 [IST]
Other articles published on Feb 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X