Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పిల్లాడిని సచిన్‌తో పోలుస్తారా?.. అది పొరపాటే!

Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సోమవారం 38 బంతుల్లో 101 పరుగులు చేసి ఐపీఎల్‌లో అతి పిన్న వయస్సులోనే సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. వైభవ్ సూర్యవంశీ వయస్సు 14 సంవత్సరాలు 32 రోజులు కావడం గమనార్హం. ఎడమ చేతివాటం రాజస్థాన్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ బౌలర్లు అయిన ఇషాంత్ శర్మ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన రషీద్ ఖాన్ , కరీం జనత్‌ల బౌలింగ్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. వైభవ్ 11 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వైభవ్ సూర్యవంశీని ఒక ప్రత్యేక ప్రతిభ గల ఆటగాడిగా అభివర్ణించాడు. వైభవ్ సూర్యవంశీ ఆటపై దృష్టి సారిస్తే భారత క్రికెట్‌కు ఎక్కువ కాలం సేవ చేయగలడని అన్నాడు. గత కొన్నినెలలుగా వైభవ్ సూర్యవంశీని నెట్స్ చూస్తున్నామని.. అతను ఏమి చేయగలడో.. ఎలాంటి షాట్లు ఆడగలడో మాకు తెలుసని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు. కానీ స్టేడియంలో మంచి బౌలింగ్ లో ఇలా దూకుడుగా ఆడడం నిజంగా ప్రత్యేకమని అభినందించాడు. వైభవ్ స్పెషల్ టాలెంట్ కలిగిన వాడని.. మంచి టెక్నిక్ ఉందని చెప్పాడు. వైభవ్ ఎంత మంచి బ్యాటరో అని అందరికీ చూపించాడని పేర్కొన్నాడు.

Don t Compare a 14-Year-Old Boy to Sachin Vaibhav Suryavanshi is Unique Says Vikram Rathour

14 ఏళ్ల పిల్లవాడు ఇలా ఆడటం ఖచ్చితంగా అతడిని ప్రత్యేకంగా మారుస్తుందని విక్రమ్ రాథోడ్ అన్నాడు. నాలుగు నెలల క్రితం మా వద్దకు వచ్చినప్పుడు అతడి దగ్గర ప్రత్యేక టాలెంట్ ఉందని గమనించామని.. దానిని ముందుకు తీసుకెళ్లడం మా బాధ్యత అని మాకు తెలుసన్నారు. కష్టపడి ఆడుతూ ఉంటే వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ కు చాలా కాలం సేవ చేయగలడని విక్రమ్ రాథోడ్ భావిస్తున్నాడు. అయితే 16 ఏళ్ల వయస్సులో భారత జట్టులోకి అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్‌తో వైభవ్ సూర్యవంశీని పోల్చడం అన్యాయమని విక్రమ్ రాథోడ్ అన్నారు. ఇలా సచిన్‌తో పోల్చడం చాలా తొందరపాటు అవుతుందన్నాడు. "ఇలా చేయడం తొందరపాటు అవుతుంది. సచిన్ టెండూల్కర్ లాంటి ఆటగాడితో పిల్లవాడిని పోల్చడం అన్యాయం." అని రాజస్థాన్ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అన్నాడు.

గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా సూర్యవంశీపై ప్రశంసలు కురిపించాడు. వైభవ్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందన్నాడు. చూడటానికి చాలా బాగుంది కానీ మేము ఇంకా బాగా బౌలింగ్ చేయగలిగేవాళ్లమని చెప్పుకొచ్చాడు. మేము ఇంకా 10 పరుగులు అధికంగా సాధించామని అనుకున్నాం.. కానీ రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు బ్యాటింగ్ ప్రారంభించిన విధానం అది తప్పు అని నిరూపించిందని అన్నాడు.

Story first published: Tuesday, April 29, 2025, 16:37 [IST]
Other articles published on Apr 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+