99.94: బ్రాడ్‌మన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఆసీస్ మాజీ బౌలర్
హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌పై ఆ దేశ మాజీ ఫాస్ట్ బౌలర్ రాడ్నీ హాగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. నానాటికీ మారుతున్న ప్రపంచ క్రికెట్‌లో నేటి తరంలో బ్రాడ్‌మన్ క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? అతను తన స్థాయిలో రాణించగలుగుతాడా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలకు వివాదాస్పద రాడ్నీ హాగ్ సమాధానాలిచ్చాడు.
బ్రాడ్‌మన్ ఈ తరంలో ఉంటే, టెస్టుల్లో అతనికి 99.94 పరుగుల సగటు సాధ్యమయ్యేది కాదని హాగ్ వ్యాఖ్యానించాడు. 1920 దశకం నుంచి 1950 దశకం వరకూ బ్యాటింగ్ చేయడం చాలా సులభంగా ఉండేదని, అప్పట్లో బౌలింగ్ గొప్పగా ఉండేది కాదని అన్నాడు. పలు గణాంకాలను కూడా అతను ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

బ్యాట్స్‌మెన్ యావరేజిలో పతనం మొదలైంది
1070, 1980 దశకాల్లో బ్యాట్స్‌మెన్ యావరేజిలో పతనం మొదలైందని చెప్పాడు. 1920-1950 మధ్యకాలంలో బ్రాడ్‌మన్ సగటు 99.94కాగా, వాల్టర్ హామండ్ 58, హెర్బర్ట్ స్టట్‌క్లఫ్ 60, లెన్ హాటన్ 56, జాక్ హాబ్స్ 56 చొప్పున సగటులతో రాణించారని గుర్తుచేశాడు. ఆతర్వాత ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్ ఎవరికీ అలాంటి యావరేజి సాధ్యం కాలేదన్నాడు.

పరుగులు సాధించడం పోలిస్తే ఇప్పుడు చాలా కష్టంగా మారింది
గ్రాండ్ గూచ్ 42, డేవిడ్ గోవర్ 43, జెఫ్రీ బాయ్‌కాట్ 47, కెవిన్ పీటర్సన్ 47 చొప్పున యావరేజిలను సాధించగలిగారని పేర్కొన్న హాగ్ టెస్టుల్లో పరుగులు సాధించడం గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా కష్టంగా మారిందని అన్నాడు. పిచ్ తీరుతెన్నులు, బౌలర్ల సామర్థ్యాలను దృష్టిలో పెట్టుకుని విశ్లేషిస్తే, బ్రాడ్‌మన్ ఈతరంలో అన్ని పరుగులు సాధ్యమయ్యేవి కావన్నాడు.

బ్రాడ్‌మన్ అంటే ఎంతో గౌరవం
తనకు బ్రాడ్‌మన్ అంటే ఎంతో గౌరవం ఉందని, అతనిని గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఆరాధిస్తానని హాగ్ చెప్పాడు. అయితే, ఇప్పటి తరం క్రికెటర్లతో అతడిని పోల్చలేమని హాగ్ తేల్చిచెప్పాడు. బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో 52 టెస్టులు (80 ఇన్నింగ్స్) ఆడిన అతను 6,996 పరుగులు చేశాడు.

సగటున 99.94 పరుగులు చేసిన బ్రాడ్‌మన్
అంటే ప్రతి టెస్టుకూ బ్రాడ్‌మన్ సగటున 99.94 పరుగులు సాధించాడు. ఈ సగటును ఇప్పటి వరకూ ప్రపంచంలో మరే ఇతర క్రికెటర్ అందుకోలేక పోవడం విశేషం. బ్రాడ్‌మన్ ఖాతాలో 29 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. తాను ఆడిన టెస్టుల్లో సగాని కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో బ్రాడ్‌మన్ సెంచరీలు సాధించాడు.

‘బాడీలైన్'ను సమర్థంగా ఎదుర్కొన్న బ్రాడ్‌మన్
234 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో, 43 సార్లు నాటౌట్‌గా నిలిచిన అతను మొత్తం 28,067 పరుగులు చేశాడు. మొత్తం మీద 95.14 యావరేజితో తనకు తిరుగులేని నిరూపించాడు. అంతేగాక, బ్యాట్స్‌మెన్‌ను, ప్రత్యేకించి తనను గాయపరిచేందుకు లక్ష్యంగా అప్పటి ఇంగ్లాండ్ బౌలర్లు ప్రవేశపెట్టిన ‘బాడీలైన్'ను సమర్థంగా ఎదుర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications