Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England vs New Zealand తొలి టెస్టు డ్రా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ముందు కివీస్‌కు అదే సానుకూలాంశం!

Dominic Sibley, Joe Root solid partnership takes England vs New Zealand 1st Test match drawn

లండన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్‌ గట్టెక్కింది. లార్డ్స్‌ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసాంతం వెనుకబడినా చివరికు మ్యాచ్‌ను రూట్ సేన 'డ్రా' చేసుకోగలిగింది. కివీస్‌ నిర్దేశించిన 273 పరుగుల లక్ష్య ఛేదనలో ఆదివారం ఐదో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌ 3 వికెట్లకు 170 రన్స్‌ చేసింది. ఓపెనర్‌ డామ్‌ సిబ్లే (207 బంతుల్లో 60 నాటౌట్‌) చివరి వరకు నిలువగా.. కెప్టెన్‌ జో రూట్‌ (40) రాణించాడు. ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ బాదిన న్యూజిలాండ్ కొత్త ఓపెనర్ డేవాన్ కాన్వె (200: 347 బంతుల్లో 22x4, 1x6)కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ జూన్ 10 నుంచి బర్మింగ్‌హామ్ వేదికగా జరగనుంది.

 కాన్వె డబుల్ సెంచరీ:

కాన్వె డబుల్ సెంచరీ:

బుధవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డేవాన్ కాన్వె డబుల్ సెంచరీ బాదడంతో తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులు చేసింది. కాన్వెతో పాటు హెన్రీ నికోల్స్ (61: 175 బంతుల్లో 4x4) పర్వాలేదనిపించాడు. టామ్‌ లాథమ్‌ (23), కేన్ విలియమ్సన్‌ (13), రాస్ టేలర్ (14), వాల్టింగ్ (1), గ్రాండ్‌హోమ్ (0) నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. మార్క్‌ వుడ్ మూడు, జేమ్స్ అండర్సన్ రెండు వికెట్లు తీశారు.

చెలరేగిన సౌథీ:

చెలరేగిన సౌథీ:

ఆపై తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను కివీస్ సీనియర్ పేసర్ టీమ్ సౌథీ (6/43) దెబ్బ తీశాడు. నిప్పులుచెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్‌ను వరుసగా పెవిలియన్ చేర్చాడు. సౌథీతో పాటు మరో పేసర్ కైల్ జేమిసన్‌ (3/85) కూడా విజృంభించడంతో ఇంగ్లండ్ ఒక దశలో 140/6తో ఇబ్బందుల్లో పడింది. అయితే కెప్టెన్‌ జో రూట్‌ (42), ఓపెనర్ రోరీ బర్న్స్‌ (132; 297 బంతుల్లో 16×4, 1×6) పట్టుదలగా పోరాడాడు. బర్న్స్‌ సెంచరీతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు (275) అందించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ ఆరు వికెట్లు పడగొట్టగా.. జెమీషన్ మూడు, వాగ్నర్ ఒక వికెట్ తీశాడు.

 169 రన్స్ వద్ద డిక్లేర్:

169 రన్స్ వద్ద డిక్లేర్:

103 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకున్న న్యూజిలాండ్.. రెండో ఇన్నింగ్స్‌ని 169/6తో డిక్లేర్ చేసింది. టామ్ లాథమ్ (36), రాస్ టేలర్ (33) రాణించారు. చివరి రోజు కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 చేసింది. ఈ సమయంలో మ్యాచుకు వర్షం అంతరాయం కలిగించడంతో.. అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఇదే సమయంలో కివీస్ సారథి రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం కలుపుకుని ఇంగ్లండ్ ముందు 273 పరుగుల లక్ష్యంను కేన్ సేన ఉంచింది.

 కివీస్‌కి భారీ ఊరట:

కివీస్‌కి భారీ ఊరట:

ఛేదనలో ఇంగ్లాండ్ ఓపెనర్ డొమినిక్ సిబ్లీ (60 నాటౌట్) అజేయ అర్థశతకం నమోదు చేయగా.. జో రూట్ (40: 71 బంతుల్లో 5x4) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 170/3తో నిలిచింది. దీంతో మ్యాచ్ డ్రా అయింది. భారత్, న్యూజిలాండ్ మధ్య సౌథాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకూ ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండగా.. డేవిడ్ కాన్వె డబుల్ సెంచరీతో వెలుగులోకి రావడం కివీస్‌కి భారీ ఊరట అనే చెప్పాలి.

Story first published: Monday, June 7, 2021, 8:11 [IST]
Other articles published on Jun 7, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+