Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2021:డొమినిక్ డ్రేక్స్ వీరంగం..చివరి బంతికి అద్భుత విజయం!తొలిసారి టైటిల్ అందుకున్న సెంట్‌ కిట్స్‌!!

Dominic DrakesSt, Joshua Da Silva shine as Kitts and Nevis Patriots wins CPL title for the 1st time

బాసెటెరె: కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్‌) 2021 విజేతగా సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌ నిలిచింది. బుధవారం రాత్రి బాసెటెరెలోని వార్నర్ పార్క్‌లో జరిగిన సీపీఎల్‌ 2021 ఫైనల్ మ్యాచులో సెయింట్ లూసియా కింగ్స్ జట్టును మూడు వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి టైటిల్ కైవసం చేసుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠంగా జరిగిన ఫైనల్ మ్యాచులో డొమినిక్ డ్రేక్స్ (24 బంతుల్లో 48 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) వీరంగం సృష్టించాడు. చివరి బంతికి సింగల్ తీసి సెంట్‌ కిట్స్‌ జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఫ్యాబియన్ అలెన్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు) కూడా చివరలో బ్యాట్ జులిపించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' డొమినిక్ డ్రేక్స్, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' రోస్టన్ ఛేజ్ దక్కించుకున్నారు.

ఆదుకున్న కార్న్‌వాల్:

ఆదుకున్న కార్న్‌వాల్:

ఫైనల్ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన సెయింట్ లూసియా కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఆండ్రీ ఫ్లెచర్, భారీ కాయుడు రకీమ్ కార్న్‌వాల్ (32 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్ ప్రారంభించారు. సెయింట్ కిట్స్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ తొలి ఓవర్ వేయగా.. నాలుగో బంతిని ఫ్లెచర్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అనంతరం వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఆ తర్వాత వర్షం ఆగిపోవడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభమైంది. అయితే ఓవర్లను కుదించకుండానే మ్యాచ్‌ను కొనసాగించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమైన మరుసటి ఓవర్‌లోనే కెప్టెన్ ఆండ్రీ ఫ్లెచర్(11) క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్క్ డెయాల్ (1) తీవ్రంగా నిరాశపరిచాడు.

కీమో పాల్ మెరుపులు:

కీమో పాల్ మెరుపులు:

ఈ సమయంలో రోస్టన్ చేజ్‌ (40 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తో కలిసి రకీమ్ కార్న్‌వాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఆచితూచి ఆడిన ఈ జోడీ.. వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించింది. ఇక క్రీజులో పాతుకు పోతున్న ఈ జోడీని అలెన్ విడదీసాడు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ వైస్ (2), టిమ్ డేవిడ్ (10) తీవ్రంగా నిరాశపరిచారు. దాంతో 100 పరుగులకే సెయింట్స్ కిట్స్ 5 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కీమో పాల్ (21 బంతుల్లో 39; 5 సిక్సలు)మెరుపులు మెరిపించాడు. 5 సిక్సర్లతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. పాట్రియోట్స్ బౌలర్లలో ఫవాద్ అహ్మద్, నసీమ్ షా రెండేసి వికెట్లు తీయగా.. ఫాబియన్ అల్లెన్, డొమినిక్ డ్రేక్స్, జాన్ రస్ చెరొక వికెట్ తీశారు.

గేల్, బ్రావో విఫలం:

గేల్, బ్రావో విఫలం:

అనంతరం ఛేదనలో సెంట్‌ కిట్స్‌ అండ్ నెవిస్ పాట్రియెట్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్లు క్రిస్ గేల్ (0), ఎవిన్ లూయిస్ (6) పూర్తిగా నిరాశపరిచారు. ఈ సమయంలో జాషువా డా సిల్వా (32 బంతుల్లో 37; 5 ఫోర్లు), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (22 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ను నిర్మించారు. దాంతో సెంట్‌ కిట్స్‌ లక్ష్యం దిశగా దూసుకెళ్లింది. అయితే 4 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరు ఔట్ అవ్వడంతో సెంట్‌ కీట్స్ కష్టాల్లో పడింది. డ్వేన్ బ్రావో (8) కూడా ఔట్ కావడంతో సెంట్‌ కిట్స్‌ ఓటమి ఖాయమే అనుకున్నారు. ఈ సమయంలో డొమినిక్ డ్రేక్స్ సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో సెంట్‌ కిట్స్‌ రేసులోకి వచ్చింది.

చివరి బంతికి సింగిల్ తీసి:

చివరి బంతికి సింగిల్ తీసి:

ఒకవైపు డొమినిక్ డ్రేక్స్ దూకుడుగా ఆడగా.. మరోవైపు ఫ్యాబియన్ అలెన్ ఆచితూచి ఆడారు. అలెన్ అనంతరం షెల్డన్ కాట్రెల్ (5) ఓ ఫోర్ బాది ఔట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లో సెంట్‌ కిట్స్‌ విజయానికి 9 పరుగులు అవసరం అయ్యాయి. డ్రేక్స్ క్రీజులో ఉండడంతో సెంట్‌ కిట్స్‌ విజయంపై నమ్మకంగా ఉంది. తొలి రెండు బంతులకు సింగిల్స్ రాగా.. మూడో బంతికి రన్ రాలేదు. నాలుగో బంతికి రెండు రన్స్.. ఐదో బంతికి డ్రేక్స్ బౌండరీ బాదడంతో చివరి బంతికి ఒక పరుగు కావాల్సి వచ్చింది. చివరి బంతికి డ్రేక్స్ సింగిల్ తీసి సెంట్‌ కిట్స్‌ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. సెయింట్ లూసియా బౌలర్ వహబ్ రియాజ్ రెండు వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు.

Story first published: Thursday, September 16, 2021, 9:01 [IST]
Other articles published on Sep 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+