Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

3-0తో యాషెస్‌ను మళ్లీ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా

Dominant Australia regain the Ashes

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌ను ఆస్ట్రేలియా 3-0తో మళ్లీ సొంతం చేసుకుంది. పెర్త్‌లోని వాకా స్టేడియంలో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను ఇంకా రెండు టెస్టులు మిగిలుండగానే ఆసీస్ సొంతం చేసుకుంది.

England vs Australia 2017 3rd Test Score Card

Australia v England - third Ashes Test in words and numbers

పెర్త్ టెస్టు:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 403 ఆలౌట్
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 662/9 డిక్లేర్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 218 ఆలౌట్

మ్యాచ్ ఫలితం: ఇన్నింగ్స్ 41 పరుగుల తేడాతో ఆసీస్ విజయం

ఓవర్ నైట్ స్కోరు 132/4 పరుగులకో సోమవారం ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్... ఆస్ట్రేలియా పేసర్ హాజెల్‌ఉడ్ (5/48) దెబ్బకు మరో 86 పరుగులు జత చేసి మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో మెరిసిన మలన్ (54) రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఇక, మిగతా బ్యాట్స్‌మెన్ జానీ బెయిన్ స్టో (14), మెయిన్ అలీ (11), క్రిస్ వోక్స్ (22), ఓవర్టన్ (12), స్టువర్ట్ బ్రాడ్ (0) విఫలం కావడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడో టెస్టులో ఓటమి పాలవ్వడంతో ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌ను ఇంగ్లాండ్ 5-0తో కోల్పోయే ప్రమాదంలో పడింది.

నిజానికి తొలి ఇన్నింగ్స్‌లో 403 పరుగులు చేసినప్పటికీ ఇంగ్లాండ్‌కు ఓటమి తప్పలేదు. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు అలెస్టర్ కుక్ దారుణంగా విఫలం కాగా, జో రూట్ స్థాయికి తగ్గట్టు రాణించలేదు.మూడో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిసిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

Story first published: Monday, December 18, 2017, 14:30 [IST]
Other articles published on Dec 18, 2017
Read in English: Australia regain the Ashes
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+