
భారత్‌కిదే సరైన సమయమంటూ
బాల్ టాంపరింగ్ కారణంగా ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లేని ఆస్ట్రేలియా జట్టును వారి గడ్డపై ఓడించడానికి భారత్‌కిదే సరైన సమయమంటూ చాలామంది వ్యాఖ్యానించారు. వారిలో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌తో పాటు అతని చిరాకాల మిత్రుడు వినోద్ కాంబ్లీ కూడా ఉన్నారు. అయితే సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలను ఖండించాడు.

ఇదే మాట ఏడాది నుంచి చెబుతున్నా.
కోహ్లీసేన ప్రదర్శనపై మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఎంతటి జట్టునైనా ఓడించగల సత్తా ప్రస్తుత భారత్‌కు ఉంది. ఈ మాట నేను ఏడాది నుంచి చెబుతున్నా. అయితే ఆస్ట్రేలియాతో జరగబోయే మ్యాచ్‌ల్లోని మొదటి ఇన్నింగ్స్‌ల్లో బ్యాట్‌తో రాణిస్తేనే భారత్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి' అని ఈ మాజీ ఓపెనర్ పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేకున్నా
‘స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ వంటి కీలక ఆటగాళ్లు లేకున్నా.. ఆసీస్‌కు అది పెద్ద విషయమేమీ కాదు. వాళ్లు లేకపోయినా మిగతా ఆటగాళ్లు తమదైన శైలిలో అదే దూకుడు ప్రదర్శించగలరు. ప్రస్తుతం వారి టెస్టు జట్టులో ఉన్న ఆటగాళ్లు అందరూ ఇప్పటికే అక్కడి ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన వారే. వారికి అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన అనుభవం లేకున్నా.. భారత్‌తో జరిగే పోరులో మంచి పోటీనే ఇవ్వగలరు.' అని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మూడో టీ20
ప్రస్తుతం టీమిండియాతో వెస్టిండీస్‌తో ఆఖరి ఫార్మాట్‌లో చివరిదైన మూడో టీ20 ఆడనుంది. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా ఆఖరి వన్డే ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుండగా, ఆఖరి టీ20లోనైనా నెగ్గి పరువు దక్కించుకోవాలని విండిస్ గట్టి పట్టుదలతో ఉంది.


Click it and Unblock the Notifications












