యాషెస్‌లో ఇంగ్లాండ్ అభిమానులు ఎగతాళి చేయడం బాధించలేదు'

హైదరాబాద్: యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో తొలి రోజైన గురువారం ఇంగ్లీషు అభిమానులు తనను ఎగతాళి చేయడం ఎంతమాత్రం బాధించలేదని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. బాల్ టాంపరింగ్ ఉదంతం అనంతరం ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన తర్వాత స్టీవ్ స్మిత్ ఆడుతోన్న తొలి టెస్టు మ్యాచ్ ఇది.
ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు ఎడ్జ్‌బాస్టన్‌లో చేదు అనుభవం ఎదురైంది. డేవిడ్ వార్నర్ ఔటై పెవిలియన్ వెళుతున్న సమయంలో ఇంగ్లీషు అభిమానులు సాండ్ పేపర్ చూపిస్తూ పెవిలియన్‌కు సాగనంపారు. ఆ తర్వాత వార్నర్, బాన్‌క్రాఫ్ట్ ఇన్నింగ్స్ ఓపెన్ చేయడానికి వెళుతున్నప్పుడు కూడా ఇంగ్లిష్ అభిమానులు 'చీటర్స్.. చీటర్స్' అంటూ నినాదాలు చేశారు.
బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత స్వదేశానికి చేరుకున్న స్టీవ్ స్మిత్ సిడ్నీలో ఏర్పాటు మీడియా సమావేశంలో ఏడ్చాడు. అప్పుడు స్టీవ్ స్మిత్ ఏడ్చిన ఫోటోలను మాస్క్‌లుగా ధరించి పలువురు ఇంగ్లాండ్ అభిమానులు ఈ మ్యాచ్‌కి హాజరైన సంగతి తెలిసిందే. అయితే, అవేమీ పట్టించుకోకుండా స్టీవ్ స్మిత్ తొలిరోజు ఒంటరి పోరాటం చేశాడు.
యాషెస్‌లో నాలుగో సెంచరీ
అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన స్టీవ్ స్మిత్ (144; 219 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులు) అద్భుతమైన సెంచరీతో ఆదుకోవడంతో యాషెస్ తొలి టెస్టులో తొలి రోజును ఆస్ట్రేలియా కాస్త గౌరవంగా ముగించింది. టెస్టుల్లో స్మిత్‌కు ఇది 24వ టెస్టు సెంచరీ కాగా యాషెస్‌లో మాత్రం నాలుగో సెంచరీ. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ అభిమానులు తనను ఎగతాళి చేయడంపై స్మిత్ స్పందించాడు.
ఎగతాళి చేయడం బాధించలేదు
"నిజాయితీ చెప్పాలంటే ఇక్కడి అభిమానులు నన్ను ఎగతాళి చేయడం బాధించలేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో నా సహచర క్రికెటర్లు నాకు మద్దతుగా నిలిచారు. అదే నాకు ముఖ్యం. నేను వందకు చేరుకున్నప్పుడు సహచర క్రికెటర్లు బాల్కనీలో తీవ్రస్థాయిలో వెళ్ళారు. దానిని చూడగానే నా వెన్నుముకలో వణుకు తగ్గింది" అని అన్నాడు.
టెస్టు సెంచరీ చేసి చాలా కాలం అయింది
"ఇక, చాలా కాలం అయ్యింది, టెస్ట్ సెంచరీ.... ఇది చాలా పెద్ద క్షణం. ప్రస్తుతానికి ఏమి చెప్పాలో నాకు తెలియదు. గత 15 నెలలు నా జీవితంలో ఎంతో భారంగా గడిచాయి. నాకు నిజంగానే తెలియదు... నేను మళ్లీ ఎప్పుడు క్రికెట్ ఆడబోనో. నేను ఒక సమయంలో క్రికెట్‌పై ప్రేమను కోల్పోయాను. నా మోచేయి ఆపరేషన్ జరిగినప్పుడు వింతగా అనిపించింది" అని స్మిత్ తెలిపాడు.
చాలా సంతోషంగా ఉంది
"ఎప్పుడైతే నా మోచేయి నొప్పి తగ్గిందో.. నేను మళ్లీ ఆటపై నా ప్రేమను కనుగొన్నాను. నేను క్రికెట్ ఆడాలి. ఆస్ట్రేలియా తరుపున మళ్లీ క్రికెట్ ఆడాలి. నాకు ఏదైతే ఇష్టమో దానిని ఆడుతున్నప్పుడు అభిమానులంతా గర్వపడాలి. నాకు ఎప్పుడూ ఇలాంటి ఫీలింగ్ కలిగేది. నేను ఏదైతే కోల్పోయానో అది తిరిగి పొందాను. ప్రస్తుతం నేనున్న పరిస్థితులను చూస్తుంటే సంతోషంగా ఉంది" అని స్మిత్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications