Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsSL: ఉమ్రాన్ మాలిక్ అంచనాలను అందుకున్నాడా?.. సత్తా నిరూపించుకున్నాడా?

Does Umran Malik prove his worth in Team India

ఇటీవలి కాలంలో టీమిండియా ఆడుతుంటే అందరూ ఆసక్తిగా చూసే ఆటగాడు ఉమ్రాన్ మాలిక్. ఈ జమ్మూకశ్మీర్ ఎక్స్‌ప్రెస్ తన సూపర్ పేస్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. అయితే అతను తన హైప్‌కు తగ్గ ప్రదర్శన చేస్తున్నాడా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో అతను ఇటీవలి కాలంలో భారత్ తరఫున ఆడిన మ్యాచులు పరిశీలిస్తే కొన్ని విషయాలు చాలా క్లియర్‌గా తేలిపోతాయి. భవిష్యత్తులో టీమిండియాకు అతను ఎంత కీలకమో ఈ అంశాలు స్పష్టంగా చెప్పేస్తున్నాయి.

ఇప్పటికే నిరూపించుకున్నాడు..

ఇప్పటికే నిరూపించుకున్నాడు..

భారత్ తరఫున టీ20, వన్డే ఫార్మాట్లలో మాత్రమే అరంగేట్రం చేసిన ఉమ్రాన్.. రెండు ఫార్మాట్లలో చెరో ఏడు వికెట్లు తీసుకున్నాడు. ఈ లెక్కలు పక్కన పెడితే అతను తన సూపర్ పేస్‌తో బ్యాటర్లను ఎంత ఇబ్బంది పెట్టగలడో నిరూపించుకున్నాడు. అతను జట్టులోకి తీసుకొచ్చే ఎక్స్‌ఫ్యాక్టర్‌కు న్యాయం చేశాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న సిరీస్‌లో కూడా రాణించిన అతను.. తొలి మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు. ముఖ్యంగా లంక కెప్టెన్ దాసున షనకను అవుట్ చేయడానికి అతను వేసిన డెలివరీ గంటకు 155 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. ఇది భారత పేసర్లు వేసిన అత్యంత వేగవంతమైన డెలివరీ కూడా కావడం గమనార్హం. ఇలా తన ఇంపాక్ట్ ఏంటో ఉమ్రాన్ ఇప్పటికే నిరూపించేసుకున్నాడు.

అనుభవంతో సత్తా చాటుతాడు

అనుభవంతో సత్తా చాటుతాడు

అంతర్జాతీయ వేదికపై ఉమ్రాన్ కెరీర్ అంత గొప్పగా ఏం లేదు. ఐర్లాండ్‌పై అరంగేట్రం చేసిన అతను తన తొలి ఓవర్లోనే 14 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో 42 పరుగులిచ్చాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతన్ని టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకోలేదు. ఈ మెగా టోర్నీ ముగిసిన తర్వాత మళ్లీ జట్టుతో చేరిన అతను తన లైన్ అండ్ లెంగ్త్ తదితర విషయాల్లో మంచి పరిణితి చూపించాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చక్కగా రాణించాడు. ఇప్పుడు లంకపై కూడా సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు ఉమ్రాన్ వయసు కేవలం 23 సంవత్సరాలే. తనకు అవసరమైన విషయాలను చాలా వేగంగా నేర్చుకుంటున్న ఈ యువ పేసర్.. ఫిట్‌గా ఉంటే భవిష్యత్తులో మరింత ప్రమాదకరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

అసలు సిసలు పేసర్..

అసలు సిసలు పేసర్..

భారత్ నుంచి ఎంతో మంది ఫాస్ట్ బౌలర్లు అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. కపిల్ దేవ్, జవగళ్ శ్రీనాథ్, జహీర్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ అందరూ అద్భుతంగా రాణించిన వారే. కానీ పాకిస్తాన్ లెజెండ్ షోయబ్ అక్తర్, ఆసీస్ దిగ్గజం బ్రెట్ లీ వంటి జెన్యూన్ పేసర్ మాత్రం భారత్‌కు దొరకలేదు. వాళ్లు తమ జమానాలో కేవలం ప్యూర్ పేస్ కారణంగానే జట్టులో చోటు దక్కించుకునే వారు. తమ ఫాస్ట్ డెలివరీలు, యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి, ఒంటి చేత్తో మ్యాచ్‌లు గెలిపించేవారు. అలాంటి వారితో ఉమ్రాన్‌ను అప్పుడే పోల్చడం కరెక్ట్ కాదు కానీ.. భవిష్యత్తులో తను కూడా ఆ స్థాయికి ఎదగగలననే ఆశలు మాత్రం ఉమ్రాన్ కల్పించాడు. దీంతో భారత జట్టు ఇంత కాలంగా వెతుకుతున్న జెన్యూన్ పేసర్ దొరికేశాడని అభిమానులు సంతోషిస్తున్నారు.

Story first published: Saturday, January 7, 2023, 14:14 [IST]
Other articles published on Jan 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+